Massive landslide | ఇలాటిలయన్ హాలిడే ఐలాండ్ దుర్ఘటన జరిగింది. పెద్ద ఎత్తున కొండచరియలు విరిగిపడటంతో 8 మంది దుర్మరణం చెందారు. మరో 13 మంది గల్లంతైనట్లు ఇప్పటివరకు అందిన సమాచారం బట్టి తెలుస్తున్నది. గత రెండు రోజులుగా ఇస్షియా ఐలాండ్‌లో భారీ వర్షాలు కురుస్తుండటంతో ఈ ఘటన జరిగినట్లు అనుమానిస్తున్నారు. 8 మంది మరణవార్తను ఇటలీ మంత్రి మాటియో సాల్విని ధ్రువీకరించారు. గల్లంతైన వారి కోసం రెస్క్యూ బృందాలు తీవ్రంగా గాలిస్తున్నాయి.
ఇస్షియా ద్వీపానికి ఉత్తరాన ఉన్న కాసామిసియోలా టెర్మ్‌లో శనివారం తెల్లవారుజామున భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. భారీగా మట్టి, రాళ్లు కింద ప్రాంతంలో ఉన్న ఇళ్లను చుట్టుముట్టాయి. కొండచరియలు విరిగిపడటంతో 8 మంది చనిపోయారు. వీరిని గుర్తించి వారి బంధువులకు అప్పగించే పనులు కొనసాగుతున్నాయి. కనిపించకుండా పోయిన 13 మందిని వెతికి పట్టుకునేందుకు రెస్క్యూ బృందాలు తీవ్రంగా గాలిస్తున్నాయి.
గల్లంతైన వారిలో భార్యాభర్తలు, వారి నవజాత శిశువు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. వర్షం కారణంగా పెద్ద ఎత్తున బురద కొండ పైనుంచి దొర్లుకుంటూ వచ్చి కింద పడటంతో కింది ప్రాంతంలో ఉన్న పలు కార్లు ధ్వంసమయ్యాయి. ఒక వాహనం సముద్రంలో కొట్టుకుపోగా. దానిలో ఉన్న ఇద్దరు వ్యక్తులను అగ్నిమాపక సేవ అధికారులు రక్షించారు.