బీరుట్: లెబనాన్ రాజధాని బీరుట్‌పై ఇజ్రాయిల్ (Israeli Strikes) చేసిన దాడిలో ఓ బిల్డింగ్ నేలమట్టం అయ్యింది. దీంతో 11 మంది మృతిచెందగా, 20 మంది గాయపడ్డారు. ఇజ్రాయిల్ జరిపిన దాడిలో 8 అంతస్తుల బిల్డింగ్ పూర్తిగా ధ్వంసమైంది. అధిక జనాభా సాంద్రత కలిగిన బస్తా జిల్లాపై 5 మిస్సైళ్లతో అటాక్ జరిగింది. ఇజ్రాయిల్ దాడితో నగరంలో పేలుళ్లు చోటుచేసుకున్నాయి. ఈ ఘటన పట్ల ఇజ్రాయిల్ మిలిటరీ ఎటువంటి ప్రకటన చేయలేదు. బస్తాకు ఎమర్జెన్సీ దళాలు చేరుకున్నాయి. భారీ స్థాయిలో పొగ కమ్ముకున్నది. శిథిలాలను తొలగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ వారంలో నాలుగోసారి బీరుట్‌పై ఇజ్రాయిల్ అటాక్ చేసింది. సోమవారం జరిగిన దాడిలో హిజ్బొల్లా ప్రతినిధి మొహమ్మద్ అఫిఫ్ మృతిచెందాడు.