వాషింగ్టన్: ఇరాన్ దాడుల వల్ల పర్షియన్ గల్ఫ్‌లో ఉన్న అమెరికా సైనిక స్థావరాలకు, ఆయుధ వ్యవస్థలకు భారీ నష్టం జరిగినట్టు ప్రాథమిక నివేదికలు పేర్కొన్నాయి. అమెరికా ప్రభుత్వంలో పనిచేసే కొందరు విశ్వసనీయ అధికారుల కథనం ప్రకారం ఇప్పటివరకు బహిరంగ ప్రపంచానికి తెలిసిన దానికంటే నష్టం ఎక్కువగా ఉంటుందని వారు తెలిపారు. దెబ్బతిన్న వ్యవస్థలకు మరమ్మతు చేయడానికి బిలియన్ల డాలర్లు అవసరమవుతాయని వెల్లడించారు. ఎన్బీసీ న్యూస్ కథనం ప్రకారం.. అమెరికా స్థావరాల్లో రన్వేలు, రాడార్ వ్యవస్థలు నాశనమయ్యాయి. అమెరికా నిఘా ఉన్నప్పటికీ ఇరాన్‌కు చెందిన పాత యుద్ధ విమానం అమెరికాలో ఒక వైమానిక స్థావరంపై దాడి చేయగలిగింది. ఇరాన్‌తో యుద్ధం చేయడానికి 200 బిలియన్ల నిధులు కావాలని గతంలో పెంటగాన్ ట్రంప్ సర్కార్‌ను కోరింది.