న్యూయార్క్: అమెరికాలోని మిలావ్కీలో రిపబ్లికన్ పార్టీ మీటింగ్ జరుగుతోంది. ఆ జాతీయ కన్వెషన్లో ట్రంప్(Donald Trump)తో పాటు పార్టీ నేతలు అందరూ పాల్గొన్నారు. అయితే అక్కడ ఓ అనుమానాస్పద వ్యక్తిని గుర్తించారు. వేదిక బయట అతను ఏకే 47 పట్టుకుని తిరుగుతున్నట్లు గుర్తించారు. స్కీ మాస్క్ ధరించిన అతన్ని అదుపులోకి తీసుకున్నారు. క్యాపిటల్ పోలీస్తో పాటు హోమ్‌ల్యాండ్ సెక్యూర్టీ సిబ్బంది అనుమానిత వ్యక్తిని గుర్తించారు. పెన్సిల్వేనియా సభలో ప్రసంగిస్తున్న సమయంలో డోనాల్డ్ ట్రంప్‌పై ఫైరింగ్ జరిగిన విషయం తెలిసిందే. 20 ఏళ్ల థామస్ మాథ్యూ క్రూక్స్ అనే వ్యక్తి జరిపిన కాల్పుల్లో ట్రంప్ చవికి గాయమైంది
పార్టీ మీటింగ్‌లో ట్రంప్‌కు మద్దతు లభించింది. రిపబ్లికన్ పార్టీ నామినేషన్ కోసం పోటీపడ్డ నిక్కీ హేలీ, రాన్ డీసాంటిస్లు.. డోనాల్డ్ ట్రంప్‌కు మద్దతు పలికారు. మనం ట్రంప్‌తో ముందుకు వెళ్లాలని హేలీ తన ప్రసంగంలో పేర్కొన్నారు. ఐక్యత చాటేందుకు మాట్లాడాలని ట్రంప్ కోరినట్లు ఆమె వెల్లడించారు. నాలుగు రోజుల పాటు రిపబ్లికన్ పార్టీ కన్వెన్షన్ జరుగుతోంది. జేడీ వాన్స్ ఉపాధ్యక్ష అభ్యర్థిగా పోటీపడనున్నారు.