ఆ ప్రమాదంలో 30 ఎముకలు విరిగాయి.. ఇన్‌స్టాలో వెల్లడించిన హాలీవుడ్ స్టార్
Jeremy Renner | హాలీవుడ్ స్టార్ జెరేమీ రెన్నర్ తాజాగా తన ఇన్‌స్టా హ్యాండిల్లో ఒక ఫొటోను షేర్ చేశాడు. ఫిజియోథెరపీ సెషన్‌కు సంబంధించి ఆ ఫొటోను షేర్ చేస్తూనే.. ప్రమాదంలో తన దేహంలోని 30 ఎముకలు విరిగిపోయాయని వెల్లడించాడు.
వాషింగ్టన్: ఇటీవల మంచులో ఇరుక్కున్న కారును వెలికితీయబోయి తీవ్రంగా గాయపడిన హాలీవుడ్ స్టార్ జెరేమీ రెన్నర్ తాజాగా తన ఇన్‌స్టా హ్యాండిల్లో ఒక ఫొటోను షేర్ చేశాడు. ఫిజియోథెరపీ సెషన్‌కు సంబంధించి ఆ ఫొటోను షేర్ చేస్తూనే.. ప్రమాదంలో తన దేహంలోని 30 ఎముకలు విరిగిపోయాయని వెల్లడించాడు.
తాను ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యానని, ఇప్పుడు ఇంట్లోనే ఫిజియోథెరపీ చేయించుకుంటున్నానని తెలిపాడు. ఒక విషాదకర సందర్భం నుంచి తాను, తన ఫ్యామిలీ తొందరగానే బయటపడ్డామని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఒంట్లో 30 ఎముకలు విరిగినా అభిమానులు, కుటుంబసభ్యులు, మిత్రుల ఆశీర్వాదంతోనే త్వరగా కోలుకున్నానని పేర్కొన్నారు.
జెరేమీ రెన్నర్ ఈ ఏడాది జనవరి 1న తన ఇంటిముందు మంచులో ఇరుక్కుపోయిన బంధువు కారును వెలికితీసే ప్రయత్నంతో తీవ్రంగా గాయపడ్డాడు. కారుపై మంచును తొలగించి బయటికితీయబోయి ఆయన జారిపడ్డాడు. ఈ ఘటనలో రెన్నర్ ఛాతికి, కాళ్లకు బలమైన గాయాలయ్యాయి. అప్పటి నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందిన ఆయన పరిస్థితి మెరుగుపడటంతో ఇప్పుడు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యాడు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | హైదరాబాద్‌లో అర్ధరాత్రి రెచ్చిపోతున్న మందుబాబులు.. గాల్లో దీపంగా అమాయకుల ప్రాణాలు!
మోదీ చట్టంపై అంబానీ, అదానీ ‘యుద్ధం’.. గోప్యతా చట్టంలోని కీలక నిబంధనలపై అభ్యంతరం
Vishwak Sen | ప్రీమియర్స్ వేస్తే ‘సైంటిస్టులు’ వచ్చేస్తారు.. పెయిడ్ రివ్యూలపై విశ్వక్ సేన్ సంచలన వ్యాఖ్యలు!
Sircilla | పరిహారం పొందిన భూమి ప్రైవేట్ వ్యక్తుల పేరిట ఎలా?.. ప్రజావాణిలో దేశాయిపల్లి గ్రామస్తుల ఫిర్యాదు
Un Stoppable | బాలయ్య ‘అన్‌స్టాపబుల్ 5’లో మెగాస్టార్ చిరంజీవి.. నిజమైతే అభిమానులకు పండగే!
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

