Vishwak Sen | ప్రీమియర్స్ వేస్తే ‘సైంటిస్టులు’ వచ్చేస్తారు.. పెయిడ్ రివ్యూలపై విశ్వక్ సేన్ సంచలన వ్యాఖ్యలు!
Vishwak Sen | తెలుగు చిత్ర పరిశ్రమలో సినిమాల విడుదలకు ముందే మొదలవుతున్న ప్రతికూల ప్రచారంపై చర్చ రోజురోజుకూ పెరుగుతోంది. సినిమా విడుదల కాకముందే అంచనాలు పెంచడం, విడుదలైన వెంటనే నెగటివ్ ప్రచారాలు, సామాజిక మాధ్యమాల్లో లక్ష్యంగా చేసుకుని ట్రోలింగ్ చేయడం వంటి పరిణామాలు నిర్మాతలను ఆందోళనకు గురిచేస్తున్నాయి.
Vishwak Sen | తెలుగు చిత్ర పరిశ్రమలో సినిమాల విడుదలకు ముందే మొదలవుతున్న ప్రతికూల ప్రచారంపై చర్చ రోజురోజుకూ పెరుగుతోంది. సినిమా విడుదల కాకముందే అంచనాలు పెంచడం, విడుదలైన వెంటనే నెగటివ్ ప్రచారాలు, సామాజిక మాధ్యమాల్లో లక్ష్యంగా చేసుకుని ట్రోలింగ్ చేయడం వంటి పరిణామాలు నిర్మాతలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. తన తాజా చిత్రం ‘కల్ట్’కు ప్రీమియర్లు నిర్వహించకపోవడానికి గల కారణంపై ఆయన వ్యంగ్యంగా స్పందించారు.
విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కల్ట్’ సినిమా అక్టోబర్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ప్రీమియర్ల గురించి ఎదురైన ప్రశ్నకు విశ్వక్ తనదైన శైలిలో సమాధానమిచ్చినట్లు సమాచారం. ప్రీమియర్లు వేస్తే చాలు.. ఇక్కడ తిరిగే సైంటిస్టులు వెంటనే బయటకు వస్తారు. సినిమాను సినిమాగా చూడకుండా ప్రతి విషయంలోనూ భూతద్దం పెట్టి లాజిక్కులు వెతుకుతారు. అందుకే మా సినిమాకు ప్రీమియర్లు పెట్టడం లేదు. అందరం 30వ తేదీనే థియేటర్లలో చూద్దాం అంటూ ఆయన అన్నారు. సినిమాను ఆస్వాదించాల్సింది పోయి, ప్రతి సన్నివేశంలోనూ లోపాలు వెతుకుతూ అతిగా విమర్శించే వారిని ఉద్దేశించి విశ్వక్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు చర్చ జరుగుతోంది. అయితే ఆయన వ్యాఖ్యలు కేవలం సాధారణ విమర్శకులను ఉద్దేశించా ? లేక కావాలనే ప్రతికూల ప్రచారం చేసే వర్గాలను లక్ష్యంగా చేసుకున్నదా? అనేది స్పష్టంగా తెలియాల్సి ఉంది.
సినిమా విజయం సాధించడంలో ప్రేక్షకుల ఆదరణతో పాటు ప్రచారం కూడా కీలక పాత్ర పోషిస్తోంది. అయితే కొందరు ఉద్దేశపూర్వకంగా ప్రతికూల ప్రచారం చేస్తున్నారనే ఆరోపణలు సినీ పరిశ్రమలో తరచూ వినిపిస్తున్నాయి. నకిలీ ఖాతాల ద్వారా రేటింగ్లను ప్రభావితం చేయడం, సినిమా విడుదలైన వెంటనే నెగెటివ్‌గా ప్రచారం చేయడం, ప్రత్యేక వీడియోలు రూపొందించి సినిమాపై ఆసక్తిని దెబ్బతీయడం వంటి అంశాలపై పలువురు సినీ ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేశారు.నాని, విజయ్ దేవరకొండ, కిరణ్ అబ్బవరం వంటి హీరోలు సైతం గతంలో సినిమా పరిశ్రమలో ప్రతికూల ప్రచారంపై తమ అభిప్రాయాలను వెల్లడించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vishwak Sen | ప్రీమియర్స్ వేస్తే ‘సైంటిస్టులు’ వచ్చేస్తారు.. పెయిడ్ రివ్యూలపై విశ్వక్ సేన్ సంచలన వ్యాఖ్యలు!
Sircilla | పరిహారం పొందిన భూమి ప్రైవేట్ వ్యక్తుల పేరిట ఎలా?.. ప్రజావాణిలో దేశాయిపల్లి గ్రామస్తుల ఫిర్యాదు
Un Stoppable | బాలయ్య ‘అన్‌స్టాపబుల్ 5’లో మెగాస్టార్ చిరంజీవి.. నిజమైతే అభిమానులకు పండగే!
Chiranjeevi | ఓటీటీలోకి మెగాస్టార్ చిరంజీవి.. నెట్‌ఫ్లిక్స్‌లో ‘మెగావర్స్’ టాక్ షో,15 ఎపిసోడ్స్‌తో భారీ ప్లాన్!
Imam Salary | మౌజన్.. ఇమామ్‌ల వేతనగోస.. ఏడు నెలలుగా 16,379 మంది ఎదురుచూపులు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

