మాట తప్పిన రష్యా.. బంధీలుగా 4 లక్షల మంది: మరియుపోల్ మేయర్
Mariupol | ఉక్రెయిన్లో దాడులను రష్యా ఉధృతం చేసింది. రేవుపట్టణమైన మరియుపోల్ (Mariupol), వోల్నోవాఖ నగరాలను రష్యన్ బలగాలు దిగ్బంధించాయి. రెండు పట్టణాలను ఆక్రమించుకునేందుకుగాను నలుదిశలా బాంబుల వర్షం కురిపిస్తూ దూసుకెళ్తున్నాయి.
హైదరాబాద్: ఉక్రెయిన్లో దాడులను రష్యా ఉధృతం చేసింది. రేవుపట్టణమైన మరియుపోల్ (Mariupol), వోల్నోవాఖ నగరాలను రష్యన్ బలగాలు దిగ్బంధించాయి. రెండు పట్టణాలను ఆక్రమించుకునేందుకుగాను నలుదిశలా బాంబుల వర్షం కురిపిస్తూ దూసుకెళ్తున్నాయి. ఎయిర్పోర్టులతోపాటు అన్ని ప్రాంతాల్లో బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. కాగా, పౌరుల తరలింపుణకు కాల్పుల విరణ పాటిస్తామని చెప్పిన రష్యా.. మాటప్పిందని మరియుపోల్ మేయర్ వదిమ్ బాయ్చెంకో ఆరోపించారు.

ఉక్రెయిన్ నుంచి పౌరుల తరలింపునకు రష్యా కాల్పుల విరమణ ప్రకటించింది. మరియుపోల్, వోల్నోవాఖ నగరాల్లో యుద్ధ క్షేత్రం నుంచి పౌరులను తరలింపునకు అవకాశం కల్పిస్తున్నామని, ఐదున్నర గంటలపాటు కాల్పులు విరమణ పాటిస్తామని రష్యా రక్షణ శాఖ ప్రకటించింది. దీంతో మరియుపోల్ నుంచి ప్రజల తరలింపునకు బస్సులు, రైళ్లను సిద్ధం చేసుకున్నామని మేయర్ వదిమ్ చెప్పారు.

అయితే గంటల్లోనే రష్యా మళ్లీ కాల్పులు ప్రారంభించింది. నగరాన్ని నిర్బంధించి.. హ్యుమానిటేరియన్ కారిడార్కు నిరాకరించినట్లు తెలిపారు. ఇప్పటికే నగరంలో నీరు, విద్యుత్తు సౌకర్యం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. రష్యన్ బలగాలు నగరంపై బాంబుల వర్షం కురిపిస్తున్నాయని వెల్లడించారు. నివాస సముదాయాలపై కూడా దాడి చేస్తున్నదని తెలిపారు. నాలుగు లక్షల మందికిపైగా నగరపౌరులను బందీలుగా చేసిందని ఆరోపించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

