ఈ ఫోటోను చూశారా. ఇప్పుడిది వైరల్ పిక్. ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో మరోసారి ఈ ఫోటో వైరల్‌గా మారింది. 2019 నాటి ఈ ఫోటో ఇప్పుడు అందర్నీ అట్రాక్ట్ చేస్తోంది. ఈ ఫోటోలో ఉన్న ఓ జంట తమ ఒంటిపై ఉక్రెయిన్, రష్యా జాతీయ జెండాలను కప్పుకున్నారు. 2019లో పోలాండ్‌లో జరిగిన మ్యూజిక్ కన్సర్ట్ సమయంలో ఈ సీన్ కనిపించింది. వాస్తవానికి ఈ ఫోటో అప్పుడు కూడా వైరల్ అయ్యింది. ఈ ఫోటోలో ఉన్న మహిళ జులియానా కుజనెత్సోవా తన శరీరంపై రష్యా జెండాను కప్పుకున్నది. ఇక ఆమెతో ఉన్న బాయ్‌ఫ్రెండ్ తన ఒంటిపై ఉక్రెయిన్ జెండాను కప్పుకున్నాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఫోటోను ఎక్కువగా షేర్ చేస్తున్నారు. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ కూడా ఈ ఫోటోను ట్వీట్ చేశారు. ప్రేమ, శాంతి .. యుద్ధంపై విజయం సాధించాలని ఆశిస్తూ ట్వీట్ చేశారు.
Poignant: A man draped in the Ukrainian flag embraces a woman wearing the Russian flag. Let us hope love, peace & co-existence triumph over war & conflict. pic.twitter.com/WTwSOBgIFK
— Shashi Tharoor (@ShashiTharoor) February 25, 2022