న్యూయార్క్ : గిన్నీస్ వరల్డ్ రికార్డును బ్రేక్ చేసేందుకు ఓ వ్యక్తి వాషింగ్టన్ డీసీలోని మొత్తం 97 మెట్రో స్టేషన్లను 8 గంటల 54 నిమిషాల్లో విజిట్ చేశాడు. అమెరికాలో రెండవ అత్యంత జనసమ్మర్ధ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టంపై అవగాహన కల్పించేందుకు ఇలా చేశానని బుధవారం 97 మెట్రో స్టేషన్లను సందర్శించిన ట్రావెల్ బ్లాగర్ లుకాస్ వాల్ చెప్పుకొచ్చారు.
2019 డిసెంబర్లో సకాట్ బెన్నెట్ 7 గంటల 59 నిమిషాల్లో 97 మెట్రో స్టేషన్లను చుట్టేయగా లుకాస్ ఈ రికార్డును చెరిపేశాడు. అయితే బెన్నెట్ జర్నీ అనంతరం మెట్రో నెట్‌వర్క్‌లో ఇటీవల ఆరు న్యూ స్టేషన్లు రావడంతో లుకాస్ వాల్ ఫీట్ సరికొత్త రికార్డుగా నిలుస్తుందని గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ తెలిపింది.
ఇక ఈ ఏడాది ఆరంభంలో ఢిల్లీలో ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్సీ) ఉద్యోగి దేశ రాజధానిలోని అన్ని మెట్రో స్టేషన్లను అత్యంత వేగంగా సందర్శించి గిన్నీస్ వరల్డ్ రికార్డును బ్రేక్ చేశాడని డీఎంఆర్సీ తెలిపింది. ప్రఫుల్ సింగ్ ఢిల్లీలోని మొత్తం 254 స్టేషన్లను 16 గంటల 2 నిమిషాల్లో చుట్టివచ్చాడని డీఎంఆర్సీ ట్విట్టర్ పోస్ట్‌లో పేర్కొంది. సింగ్ మొత్తం 347 కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఈ ఫీట్ సాధించాడని తెలిపింది.