కరోనా మహమ్మారి తర్వాత అందరూ ఫిట్‌నెస్‌పై దృష్టిపెట్టారు. చిన్నా పెద్ద తేడాలేకుండా ప్రతి ఒక్కరూ వర్కౌట్స్ చేస్తున్నారు. జిమ్‌కు వెళ్లలేనివాళ్లు వాళ్లకు అందుబాటులో ఉన్న పరికరాలతో కసరత్తులు చేస్తున్నారు. ఓ ఆఫ్రికన్ తన ఫిట్నెస్ను పెంచుకునేందుకు ఓ మూగజీవిని ఎంచుకున్నాడు. బలిష్టమైన మేకపోతుతో అతడు ఢీకొట్టే వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
ఈ వీడియోను కేడాట్ అనే యూజర్ ట్విటర్లో షేర్ చేశారు. పెద్ద బండపై నిల్చుని ఉన్న మేక తలను కింద నిల్చుని ఉన్న వ్యక్తి బలంగా నెట్టాడు. మేకకూడా అదే ఫోర్స్‌తో ముందుకు నెట్టింది. దాదాపు 20 సెకన్లు సమఉజ్జీగా తలపడిన తర్వాత మేక మనిషిని కాస్తదూరం నెట్టివేసింది. ఈ వీడియో ఆన్లైన్లో చక్కర్లు కొట్టగా, నెటిజన్లు చూసి ఆశ్చర్యపోయారు. ఈ వీడియోను లక్షకుపైగా మంది లైక్ చేశారు.
New neck training regimen just hit the block boys pic.twitter.com/7XfVV60AzJ
— KDOT 🦍 (@KdotUntamed) March 24, 2022