Beauty Courses | టోక్యో, ఫిబ్రవరి 23 : జపాన్‌లోని ఓ పోలీసు అకాడమీ తమ వద్ద శిక్షణ పొందుతున్న పురుష అధికారులకు బ్యూటీ కన్సల్టెంట్లను పిలిపించి మరీ మేకప్ కళలో శిక్షణ ఇప్పిస్తోంది. ఫుకుషిమాలోని పోలీసు అకాడమీలో ఈ ఏడాది జనవరిలో 60 మంది పోలీసు అధికారులకు మేకప్ కోర్సు ప్రారంభించినట్టు సౌత్ చైనా మార్నింగ్ పోస్టు వెల్లడించింది. ఐబ్రో పెన్సిల్స్ వినియోగం, మాయిశ్చరైజింగ్ స్కిన్, ప్రైమర్లు ఐప్లె చేయడం వంటి ప్రాథమిక మేకప్ మెళకువలను నేర్పించడంతోపాటు కనుబొమ్మలను ట్రిమ్మింగ్ చేయడం, హెయిర్ైస్టెలింగ్ టెక్నిక్స్‌లో కూడా పోలీసు అధికారులకు శిక్షణ ఇస్తున్నారు.
ఇందు కోసం ప్రముఖ జపనీస్ కాస్మటిక్స్ బ్రాండ్ షిసీడో నుంచి ప్రొఫెషనల్ మేకప్ కన్సల్టెంట్లను పోలీసు అకాడమీకి రప్పిస్తున్నారు. సమాజంలోని వివిధ వర్గాలకు చెందిన వారితో పోలీసు అధికారులు మెలగాల్సి ఉంటుంది కాబట్టి వారు నీట్‌గా ఉండాల్సిన అవసరం ఉంటుందని పోలీసు అకాడమీ వైస్ ప్రిన్సిపల్ టకేషీ సుగీరా చెప్పారు. సమాజంలో సభ్యులుగా, భవిష్యత్ పోలీసు అధికారులుగా వారు నీటుగా, అందంగా ఉండాలన్న ఉద్దేశంతోనే మేకప్ శిక్షణ ఇప్పిస్తున్నట్టు ఆయన తెలిపారు.