తైపీ: తైవాన్లో భారీ భూకంపం సంభవించింది. రాజధాని తైపీతోపాటు ఈశాన్య తైవాన్లో ఆదివారం మధ్యాహ్నం 1.11 గంటల సమయంలో భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.7గా నమోదయిందని తైవాన్ సెంట్రల్ వెదర్ బ్యూరో వెల్లడించింది. భూ అంతర్భాగం 67 కిలోమీటర్ల లోతులో భూమి పొరలు కదిలాయని తెలిపింది.
భూ ప్రకంపణల వల్ల తైపీలో భవనాలు కొన్నిసెకన్ల పాటు ఊగిపోయాయని తెలిపారు. భూకంపం రావడంతో ప్రజలు రోడ్లపైకి పరుగులు తీశారు. కాగా, భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన సమాచారం ఇంకా అందలేదని అధికారులు తెలిపారు. ఇలాన్ కౌంటీలో 30 సెకండ్లపాటు భూమి కంపించిందని ఏఎఫ్పీ రిపోర్టర్ తెలిపారు.
Just now survived 6.7 Rector Scale earthquake. It was a horrible experience and my legs are still shivering🥺. Hope people in Taipei city are safe. #earthquake #taipei #taipeiearthquake #horrible #horribleexperience #StaySafe @Taiwan_Today @TaiwanInsider @TaipeiCity pic.twitter.com/EYSeiPj1TF
— neha upadhyay (@research_freak) October 24, 2021
6.7 on the Richter scale just now… in Yilan, northeastern Taiwan. pic.twitter.com/AeylDSpn0d
— Andrew Ryan 阮安祖 (@thefeast) October 24, 2021