పారిస్, ఏప్రిల్ 24: ఫ్రాన్స్ అధ్యక్షుడిగా ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ మళ్లీ ఎన్నికయ్యారు. మరో ఐదేండ్ల పాటు పదవిలో కొనసాగనున్నారు. ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ప్రత్యర్థి మెరీన్ లీ పెన్‌పై మాక్రాన్ స్పష్టమైన విజయం సాధించారు. మాక్రాన్‌కు 58% ఓట్లు రాగా, పెన్కు 42% ఓట్లు పడ్డాయి. గడిచిన 20 ఏండ్ల కాలంలో వరుసగా రెండు సార్లు అధ్యక్షుడైన వ్యక్తిగా మాక్రాన్ రికార్డు సృష్టించారు.