Lunar lander | విజయవంతంగా అంతరిక్షంలోకి లూనార్ ల్యాండర్.. ఫిబ్రవరి 23న జాబిల్లిపైకి పెరిగ్రీన్..!
Lunar lander | అమెరికా అంతరిక్ష ప్రయోగ సంస్థ నాసా దాదాపు 50 ఏళ్ల విరామం తర్వాత జాబిల్లిపైకి మరో ల్యాండర్‌ను పంపింది. ఆస్ట్రోబోటిక్ టెక్నాలజీస్ అనే ప్రైవేటు సంస్థ రూపొందించిన పెరిగ్రీన్ ల్యాండర్‌ను స్థానిక కాలమానం ప్రకారం సోమవారం తెల్లవారుజామున విజయవంతంగా ప్రయోగించింది. ఫ్లోరిడాలోని అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి యునైటెడ్ లాంచ్ అలయన్స్‌కు చెందిన ‘వల్కన్’ రాకెట్ ఈ ల్యాండర్‌ను తీసుకొని నింగిలోకి దూసుకెళ్లింది.
Lunar lander: అమెరికా అంతరిక్ష ప్రయోగ సంస్థ నాసా దాదాపు 50 ఏళ్ల విరామం తర్వాత జాబిల్లిపైకి మరో ల్యాండర్‌ను పంపింది. ఆస్ట్రోబోటిక్ టెక్నాలజీస్ అనే ప్రైవేటు సంస్థ రూపొందించిన పెరిగ్రీన్ ల్యాండర్‌ను స్థానిక కాలమానం ప్రకారం సోమవారం తెల్లవారుజామున విజయవంతంగా ప్రయోగించింది. ఫ్లోరిడాలోని అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి యునైటెడ్ లాంచ్ అలయన్స్‌కు చెందిన ‘వల్కన్’ రాకెట్ ఈ ల్యాండర్‌ను తీసుకొని నింగిలోకి దూసుకెళ్లింది. అన్నీ సజావుగా సాగితే ఫిబ్రవరి 23న ఈ లూనార్ ల్యాండర్ జాబిల్లి ఉపరితలంపై దిగనుంది.
అంతరిక్ష రేసులో ప్రైవేటురంగ భాగస్వామ్యాన్ని మరింత విస్తృతం చేసే దిశగా నాసా కీలక చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలోనే సొంతంగా లూనార్ ల్యాండర్స్‌ను అభివృద్ధి చేసేందుకు ఇటీవల రెండు కంపెనీలకు కాంట్రాక్టులిచ్చింది. పెరిగ్రీన్ ల్యాండర్ కోసం 108 మిలియన్ డాలర్లకు ఆస్ట్రోబోటిక్‌తో కాంట్రాక్ట్ కుదుర్చుకుంది. తాజాగా ప్రయోగించిన పెరిగ్రీన్ ల్యాండర్ పలు సైంటిఫిక్ పరికరాలను మోసుకెళ్లింది. ఈ సైంటిఫిక్ పరికరాలు జాబిల్లి ఉపరితలంపై అధ్యయనం చేసి ఆ సమాచారాన్ని నాసాకు పంపించనున్నాయి.
పెరిగ్రీన్ మోసుకెళ్లిన సైంటిఫిక్ పరికరాలు చంద్రుడిపై చేసే అధ్యయనం ఈ ఏడాది చివర్లో చందమామపైకి నాసా చేపట్టబోయే మానవసహిత ప్రయోగానికి ఎంతో కీలకం కానున్నది. ఈ ఏడాది ఆఖర్లో ఆర్టెమిస్-2 పేరుతో నాసా చంద్రుడిపైకి నలుగురు వ్యోమగాములను పంపనుంది. అందుకు సంబంధించిన సన్నాహకాల్లో భాగంగానే ఇవాళ పెరిగ్రీన్ ల్యాండర్‌ను ప్రయోగించింది.
కాగా, 1969లో అపోలో 11 రాకెట్లో నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్, బుజ్ ఆల్డ్రిన్, మైఖేల్ కాలిన్స్ జాబిల్లికిపైకి వెళ్లారు. చంద్రుడిపై అడుగుపెట్టారు. ఆ తర్వాత కూడా 1972 వరకు కూడా నాసా ఆరుసార్లు మానవసహిత జాబిల్లి యాత్రలు నిర్వహించింది. పలుమార్లు మెషిన్ ల్యాండర్లను ప్రయోగించింది. ఇప్పుడు ఆర్టెమిస్-2 ప్రయోగంతో మరో నలుగురు వ్యోమగాములను చంద్రుడిపైకి పంపించేందుకు సన్నాహాలు చేస్తున్నది.
ఇదిలావుంటే చంద్రుడిపై అడుగుపెట్టే తొలి ప్రైవేటు కంపెనీగా అవతరించాలని పెరిగ్రీన్ను రూపొందించిన ఆస్ట్రోబోటిక్ లక్ష్యంగా పెట్టుకుంది. అయితే అంతకంటే ముందుగానే మరో కంపెనీ ఈ ఘనత సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే హ్యూస్టన్‌కు చెందిన ఇంట్యూటివ్ మెషిన్స్ కంపెనీ త్వరలోనే ల్యాండర్ ప్రయోగాన్ని చేపట్టనుంది. దీన్ని చంద్రుడిపైకి నేరుగా వెళ్లే మార్గంలో పంపించనున్నారు. తాజాగా ప్రయోగించిన పెరిగ్రీన్ మాత్రం కక్ష్యలన్నీ తిరుగుతూ జాబిల్లిని చేరనుంది. ఇంట్యూటివ్ మెషిన్స్ తయారు చేసిన నోవా-సి ల్యాండర్‌ను ఫిబ్రవరి ఆరంభంలో స్పేస్ఎక్స్ రాకెట్ తీసుకెళ్లనుంది. వారం రోజుల్లోనే చంద్రుడిపై అడుగుపెట్టేలా దాన్ని ప్రయోగించనున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

