చరిత్రలో ఈరోజు: అంధులకు దారి చూపిన మహోన్నతుడీయన
Today History: బ్రెయిలీ లిపిని కనిపెట్టి, దృష్టి లోపం ఉన్నవారు చదవడానికి, వ్రాయడానికి వీలు కల్పించిన వ్యక్తిగా చిరస్థాయిగా నిలిచిపోయారు. బ్రెయిలీ తన చిన్నతనంలోనే ఓ ప్రమాదంలో కంటిచూపు కోల్పోయాడు. ఈయన తండ్రి...

Today History: కండ్లు కనిపించని వారు ఎంత ఇబ్బంది పడతారో కండ్లున్న వారికి తెలియదు. కండ్లు కనిపించకుండా చేసుకుని ఒకరోజు జీవిస్తే వారి జీవితం ఎంతగా సమస్యలతో ముడిపడి ఉందో అర్ధమవుతుంది. ఇలాంటి ఎన్నో వ్యధల నుంచి బయటపడేసి వారికి చదవడం, రాయడం నేర్పేందుకు నడుం బిగించారు లూయిస్ బ్రెయిలీ. చిన్ననాట కంటి చూపు కోల్పోయిన ఈయన.. తన లిపితో తోటి అంధులకు మార్గదర్శిగా నిలిచారు.
లూయిస్ బ్రెయిలీ 1809లో సరిగ్గా ఇదే రోజున ఫ్రాన్స్‌లోని కూపేర్లోని ఒక చిన్న పట్టణంలో జన్మించాడు. బ్రెయిలీ లిపిని కనిపెట్టి, దృష్టి లోపం ఉన్నవారు చదవడానికి, వ్రాయడానికి వీలు కల్పించిన వ్యక్తిగా చిరస్థాయిగా నిలిచిపోయారు. బ్రెయిలీ తన చిన్నతనంలోనే ఓ ప్రమాదంలో కంటిచూపు కోల్పోయాడు. ఈయన తండ్రి రేలీ బ్రెయిలీ.. రాజ గుర్రాలకు జీను తయారీదారుగా పనిచేసేవాడు. మూడేండ్ల వయస్సులో ఉన్నప్పుడు తన తండ్రి పనిముట్లతో ఆడుకుంటున్నప్పుడు ఒక సాధనం అతడి కంటికి తగిలి పెద్ద గాయమైంది. 8 సంవత్సరాల వయస్సులో కంటి చూపును పూర్తిగా కోల్పోయాడు.
తనకు 16 ఏండ్ల వయసులో ఉన్నప్పుడు ప్రత్యేక లిపిని కనిపెట్టాలనే ఆలోచన వచ్చింది. సైనికులు రాత్రివేళ చీకటిలో చదవడానికి ఉపయోగపడే ‘నైట్ రైటింగ్’, ‘సోనోగ్రఫీ’ గురించి ఫ్రెంచ్ సైన్యంలో కెప్టెన్ చార్లెస్ బార్బియర్ వద్ద తెలుసుకున్నాడు. ‘నైట్ రైటింగ్’ అనేది స్క్రిప్ట్‌ను కాగితంపై 12 చుక్కల ఆధారంతో చిత్రీకరించడం. అంధుల కోసం లిపి రూపొందించాలనే ఆలోచన బ్రెయిలీకి ఈ స్క్రిప్ట్ నుంచే వచ్చింది. 12 కు బదులుగా 6 చుక్కలను ఉపయోగించి 64 అక్షరాలు, చిహ్నాలను రూపొందించాడు. అలాగే, విరామ చిహ్నాలు, గణిత చిహ్నాలు, సంగీతం సంజ్ఞామానం రాయడానికి అవసరమైన చిహ్నాలను కూడా తయారు చేశాడు. ఇలా 1825 లో లూయిస్ బ్రెయిలీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న అంధులు చదవడానికి, వ్రాయడానికి లిపిని కనుగొన్నారు. 1851 లో టీబీకి గురైన బ్రెయిలీ, ఆరోగ్యం క్షీణించి 43 ఏండ్ల వయసులో 1852 లో తుదిశ్వాస విడిచారు. ఈయన చనిపోయిన 16 ఏండ్లకు బ్రెయిలీ లిపిని రాయల్ ఇన్స్టిట్యూట్ గుర్తించింది. ఆయన గౌరవార్ధం భారత ప్రభుత్వం 2009 లో పోస్టల్ స్టాంప్‌తోపాటు రెండు రూపాయల బిల్లను తీసుకొచ్చింది.
మరికొన్ని ముఖ్య సంఘటనలు..
2010 : ప్రపంచంలో అతి పొడవైన భవనం బుర్జ్ ఖలీపా ప్రారంభం
1994: ప్రముఖ సంగీత స్వరకర్త ఆర్డీ బర్మన్ మరణం
1990: పాకిస్తాన్లో రెండు రైళ్లు ఢీకొన్న ఘటనలో దాదాపు 307 మంది మరణం
1972: న్యూఢిల్లీలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రిమినాలజీ అండ్ ఫోరెన్సిక్ సైన్స్ ప్రారంభం
1966: తాష్కెంట్లో లాల్ బహదూర్ శాస్త్రి-జనరల్ అయూబ్ ఖాన్ చర్చలు
1962: మొదటి ఆటోమేటిక్ సబ్వే రైలు అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ప్రారంభం
1951: కొరియా యుద్ధంలో సియోల్‌ను స్వాధీనం చేసుకున్న చైనా బలగాలు
1948: బ్రిటన్ నుంచి స్వాతంత్ర్యం ప్రకటించుకున్న మయన్మార్
1906: కలకత్తాలో విక్టోరియా మెమోరియల్ హాల్‌కు శంకుస్థాపన చేసిన కింగ్ జార్జ్ V
1643: ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త ఐజాక్ న్యూటన్ జననం
ఇవి కూడా చదవండి..
ఇప్పటిదాకా కరోనా.. ఇప్పుడు ఫ్లొరోనా! దీని లక్షణాలు ఏంటి?.. ఎంత ప్రమాదకరం?
మీ జీవితభాగస్వామి మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నారా.. తస్మాత్ జాగ్రత్త..!
చర్మంపై దద్దుర్లు, దురద ఉంటే.. ఒమిక్రాన్ కావచ్చు..?!
గాడిద పాలు ఆరోగ్యానికి మంచివేనా ? వాటికి ఎందుకంత డిమాండ్ ?
శృంగారంపై ఆసక్తి తగ్గిపోయిందా.. అయితే ఈ ఫుడ్స్ తీసుకోండి..
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

