మనుషులు ఎత్తుకు తగ్గ బరువుండాలి. అప్పుడే ఆరోగ్యవంతులుగా పరిగణిస్తారు. ఎత్తు, బరువును కొలిచి బాడీ మాస్ ఇండెక్స్‌ను లెక్కిస్తారు. దీని ఆధారంగా వ్యక్తి ఆరోగ్యస్థితిని అంచనా వేస్తారు. అయితే, ఇది మనుషులకే కాదు.. జంతువులకూ వర్తిస్తుంది. అందుకే బ్రిటన్‌లోని జడ్ఎస్ఎల్ లండన్ జంతుప్రదర్శనశాల ఈ నెల 25న జంతువుల బరువు, ఎత్తును కొలిచే ప్రక్రియను ప్రారంభించింది. ఇందుకు సంబంధించిన వీడియో ఆన్లైన్లో పెట్టగా, వైరల్ అవుతోంది.
ఈ వీడియోలో పెంగ్విన్లు ఒడ్డుకు రాగా, జూ కీపర్ వాటికి ఆహారం అందిస్తూ బరువు కొలుస్తున్నాడు. సుమత్రన్ పులి గయ్షా తన ఎత్తును కొలుచుకోవడం కనిపిస్తుంది. ఇది అంతరించిపోతున్న మూడు పులి పిల్లలకు ఇటీవలే జన్మనిచ్చింది. సీజనల్ అక్వేరియం కీపర్ కొలెట్ గిబ్బింగ్స్ టైనీ జెయింట్స్ అక్వేరియంలోకి వెళ్లి బ్రెయిన్ కోరల్స్ బరువును కొలిచాడు. బొలీవియన్ బ్లాక్-క్యాప్డ్ స్క్విరెల్ కోతుల దళం ఆహారం కోసం వచ్చి వాటిని బరువును తూచుకున్నాయి. ఒంటెను నెమ్మదిగా వెయింగ్ మిషన్‌పై ఎక్కించి, బరువు కొలిచారు. ఇలా జూలోని దాదాపు 15,000 జంతువుల బరువు, ఎత్తును వారంలో కొలుస్తామని జూలోని డిప్యూటీ ఆపరేషన్స్ మేనేజర్ డేనియల్ సిమండ్స్ తెలిపాడు. ఈ జంతువుల ఎత్తు, బరువును రికార్డు చేసి పెడతామని చెప్పాడు. ఏదైనా జంతువు సడెన్ బరువు తగ్గితే తెలుసుకుని, పశువైద్యుడికి తెలియజేసేందుకు ఈ డేటా ఉపయోగపడుతుందని తెలిపాడు.
VIDEO: London Zoo holds annual animal weigh-in
Zookeepers at ZSL London Zoo begin a week-long process of enticing nearly 15,000 animals onto scales to be weighed and have measurements taken pic.twitter.com/19SN2nVCVS
— AFP News Agency (@AFP) August 26, 2022