ఇస్లామాబాద్: నకిలీ కాల్ సెంటర్‌పై దర్యాప్త సంస్థ అధికారులు రైడ్ చేశారు. అందులో పని చేస్తున్న వారిని అరెస్ట్ చేశారు. ఇంతలో స్థానికులు ఆ కార్యాలయంలోకి చొరబడ్డారు. అందులోని ల్యాప్‌టాప్‌లు, ఇతర పరికరాలను ఎత్తుకెళ్లారు. (Locals Loot Laptops) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో ఈ సంఘటన జరిగింది. సెక్టార్ ఎఫ్ 11లో నకిలీ కాల్ సెంటర్ నిర్వహిస్తున్నట్లు ఆ దేశానికి చెందిన ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎఫ్ఐఏ) గుర్తించింది. మార్చి 15న దర్యాప్తు అధికారులు ఆ స్కామ్ సెంటర్‌పై రైడ్ చేశారు. విదేశీయులతో సహా 24 మందిని అదుపులోకి తీసుకున్నారు. అయితే కొంతమంది నిందితులు అక్కడి నుంచి పారిపోయారు.
కాగా, స్కామ్ సెంటర్‌పై రైడ్ సందర్భంగా అక్కడ గందరగోళం ఏర్పడింది. భద్రత సరిగా లేకపోవడంతో స్థానికులు ఆ కార్యాలయంలోకి చొరబడ్డారు. చేతికి అందిన ల్యాప్‌టాప్‌లు, ఎలక్ట్రానిక్ పరికరాలను ఎత్తుకెళ్లారు.
మరోవైపు కీలక ఆధారాలను స్థానికులు లూటీ చేయడంతో ఎఫ్ఐఏ అధికారులు కంగుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ కేసుపై దర్యాప్తు ఎలా సాగుతుందో అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. కాగా, ల్యాప్‌టాప్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను స్థానికులు ఎత్తుకెళ్తున్న వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Pakistanis have looted the Chinese Call centres in Islamabad….laptops, TV & other items all looted 😂
Note: This happened in holy month of Ramzan. pic.twitter.com/dlb2vKOKPh
— Incognito (@Incognito_qfs) March 17, 2025