సింహం గర్జన వింటేనే భయపడిపోతాం. మనుషులే కాదు.. వేరే జంతువులు కూడా ఆ గర్జన విని అక్కడినుంచి పారిపోతాయి. సింహాలు గట్టిగా గర్జిస్తూ అడవిలో రాజుల్లా తిరుగుతుంటాయి. మరి మీరెప్పుడైనా సింహం పిల్లల గర్జన విన్నారా? అవి ఎలా గర్జించడం నేర్చకుంటాయో తెలుసా? లేకుంటే ఈ వీడియో చూడండి. సింహం పిల్ల గర్జించడం నేర్చుకుంటున్న వీడియో నెట్టింట వైరల్గా మారింది.
ఈ వీడియోను ‘బిటింగెబిడెన్’ అనే యూజర్ ట్విటర్లో షేర్చేశారు. ఓ మూడు నుంచి నాలుగు నెలల వయస్సున్న సింహం పిల్ల తన తల్లి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అప్పుడే గర్జించడం నేర్చుకుంటుంది. ఆ పిల్ల సింహం గర్జన చెవుకు ఇంపుగా ఉంది. అచ్చం ఇండ్లలో పిల్లిలా అరిచింది. ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకున్నది. ఈ వీడియోకు దాదాపు రెండు లక్షల వ్యూస్, 16 వేల లైక్స్ వచ్చాయి.
A mighty roar in progress.. 😊 pic.twitter.com/3mrEtGibkr
— Buitengebieden (@buitengebieden) June 26, 2022