నెపోలియన్, హిట్లర్‌లా అమెరికా.. పశ్చిమ దేశాలే అణుయుద్ధానికి ఉసిగొల్పుతున్నాయి
మాస్కో: రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ఇవాళ మళ్లీ వార్నింగ్ ఇచ్చారు. మూడో ప్రపంచ యుద్ధం వస్తే, అది అణ్వాయుధ యుద్ధమే అవుతుందన్నారు. ఇవాళ న్యూస్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు. ఆంక్షలతోనే మూడవ ప్రపంచ యుద్ధానికి దిగుతామని బైడెన్ చేసిన కామెంట్‌ను ఆయన ప్రస్తావిస్తూ.. మూడవ ప్రపంచ యుద్ధం కేవలం న్యూక్లియర్ వార్ మాత్రమే అవుతుందన్నారు. అణు యుద్ధం చేయాలని పశ్చిమ దేశాలు భావిస్తున్నాయని, ఆ ఆలోచనలు పశ్చిమ దేశాల నేతల్లో ఉన్నదని, రష్యా ప్రజల మనోభావాల్లో ఆ ఉద్దేశం లేదని లావ్రోవ్ తెలిపారు. ఒకవేళ ఎవరైనా నిజమైన యుద్ధం చేయాలని భావిస్తే, అప్పుడు వాళ్లు అలాంటి ప్రణాళికల గురించి ఆలోచించాలన్నారు.
ఉక్రెయిన్ ప్రభుత్వం నియో-నాజీల తరహాలో వ్యవహరిస్తోందన్నారు. పట్టణాలు, నగరాల్లో ఆ గ్యాంగ్‌లు లూటీలకు పాల్పడుతున్నట్లు లావ్రోవ్ ఆరోపించారు. సాధారణ పౌరులను కవచాల తరహాలో ఉక్రేనియన్లు వాడుతున్నట్లు ఆయన విమర్శించారు. పశ్చిమ దేశాలను హాలీవుడ్ మూవీలతో పోల్చిన ఆయన.. దీన్ని వెస్ట్రన్ మీడియా రాసిన హాలీవుడ్ మూవీలా భావించకూడదన్నారు. రష్యాను పణంగా పెట్టి పశ్చిమ దేశాల భద్రతను నాటో పెంచుతున్నట్లు ఆయన ఆరోపించారు. అమెరికా ఓ నెపోలియన్, హిట్లర్ తరహాలో ప్రవర్తిస్తోందన్నారు. గతంలో నెపోలియన్, హిట్లర్లు.. యూరోప్‌ను తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలని భావించారని, ఇప్పుడు అమెరికన్లు కూడా అదే చేస్తున్నారని లావ్రోవ్ ఆరోపించారు. నార్డ్‌స్ట్రీమ్ 2 గ్యాస్ పైప్‌లైన్‌ను రద్దు చేసి అమెరికా తన నిజస్వరూపాన్ని బయటపెట్టిందన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Hitler
- Napolean
- Nuclear War
- Russia
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

