వాషింగ్టన్ : దేశంలోనే అతిపెద్దదైన హైదరాబాద్‌లోని అంబేద్కర్ విగ్రహానికి ప్రతిరూపంగా నిర్మించిన భారత రాజ్యాంగ నిర్మాత 19 అడుగుల పొడవైన విగ్రహాన్ని అమెరికాలో ఆవిష్కరించారు. భారత్ వెలుపల ఇంత పొడవైన విగ్రహాన్ని ప్రతిష్ఠించడం ఇదే ప్రథమం.
అమెరికా రాజధానికి సమీపంలోని మేరీల్యాండ్ సబర్బ్ ప్రాంతంలో 13 ఎకరాల విస్తీర్ణంలో, వైట్‌హౌస్‌కు 22 మైళ్ల దూరంలోని అకోకిక్ టౌన్షిప్లో దీన్ని ఏర్పాటుచేశారు. ఈ ‘స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ’ ప్రారంభోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ప్రముఖ శిల్పి రామ్ సుతార్ నిర్మించిన ఈ విగ్రహం హైదరాబాద్‌లో నిర్మించిన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహానికి ప్రతిరూపంగా నిర్మించారు.