చాలామంది విదేశీయులు ఇండియా అంటే ఇష్టపడతారు. ఇక్కడి సంస్కృతి, భాషలను ప్రేమిస్తారు. వాటిని అనుకరిస్తారు. ఇండియన్ వ్యక్తికి భార్య అయిన ఓ దక్షిణా కొరియా యువతి ఇదే కోవలోకి వస్తారు. ఆమెకు భారతీయ భాష ఎంత ఇష్టమో తెలిపే వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
ఈ వీడియోలో దక్షిణ కొరియాకు చెందిన మహిళ పకోడీలు చేస్తుంటుంది. బ్యాక్‌గ్రౌండ్‌లో అరిజిత్ సింగ్ పాడిన ట్రెండింగ్ పాట ‘అటక్ గయా’ ప్లే అవుతోంది. ఈ రీల్ 1.5 మిలియన్లకు పైగా వీక్షణలు పొందింది. ఆమె తన ఇతర రీల్స్‌లో అనేక భారతీయ వంటకాలను వండడం కూడా చూడవచ్చు. అలాగే, మరో రీల్లో మహిళ పకోడీలను తయారు చేయడంతోపాటు వాటిని హిందీలో ఎలా పలుకాలో కొడుకుకు నేర్పిస్తున్నది. ఈ వీడియో మూడు లక్షకుపైగా వీక్షణలతో దూసుకుపోతున్నది. ఈ తల్లీకొడుకుల వీడియోలు ఇండియన్ నెటిజన్లను అమితంగా ఆకట్టుకున్నాయి.