Planes Collide On Airport Runway : కొరియన్ ఎయిర్‌లైన్స్, హాంకాంగ్‌కు చెందిన క్యాథే పసిఫిక్ ఎయిర్వేస్కు చెందిన రెండు విమానాలు జపాన్‌లోని న్యూ చిటోస్ ఎయిర్‌పోర్ట్‌లో ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇరు విమానాల్లో ఏ వ్యక్తికీ గాయాలు కాలేదని జపాన్ మీడియా వెల్లడించింది.
ప్రమాదం జరిగిన సమయంలో కొరియన్ ఎయిర్ ఫ్లైట్‌లో 289 మంది ప్రయాణీకులు, విమాన సిబ్బంది ఉన్నారు. క్యాథే పసిఫిక్ విమానంలో ఆ సమయంలో ఎంతమంది ప్రయాణీకులున్నారనే వివరాలు వెల్లడి కాలేదు.
ఇక కొరియన్ ఎయిర్ విమానాన్ని డిపార్చర్‌కు ముందు టోయిగ్ కారు వెనుకకు నెడుతుండగా గ్రౌండ్‌పై మంచుకారణంగా విమానం జారి క్యాథీ పసిఫిక్ ప్లేన్ వింగ్‌ను ఢీ కొందని అధికారులు తెలిపారు. ఇరు విమానాలు ఢీకొన్న ఘటనలో ఎవరూ గాయపడకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
Read More :
Delhi | ఢిల్లీని కమ్మేసిన దట్టమైన పొగమంచు.. విమాన సర్వీసులకు అంతరాయం