కిమ్‌కు తీవ్ర అనారోగ్యం… దక్షిణ కొరియా కారణమంటూ సోదరి ఆగ్రహం
ప్యోంగ్యాంగ్: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తీవ్ర అనారోగ్యానికి గురైనట్లు అతడి సోదరి కిమ్ యో జోంగ్ తెలిపింది. దీనికి దక్షిణ కొరియా కారణమని ఆరోపించింది. కరోనా వైరస్‌ను కరపత్రాల ద్వారా ఉత్తర కొరియాలోకి వ్యాపిస్తున్నారంటూ మండిపడింది. ఒక ప్రసంగంలో మాట్లాడిన ఆమె, తన సోదరుడు కిమ్ జ్వరం వల్ల తీవ్ర అనారోగ్యం బారిన పడిటనట్లు చెప్పింది. అయితే ప్రజల కోసం ఆయనకున్న ఆందోళన వల్ల ఒక్క క్షణమైనా బెడ్‌పై విశ్రాంతి తీసుకోలేదని తెలిపింది.
అలాగే కిమ్ సోదరి యో జోంగ్ మరోసారి దక్షిణ కొరియాకు వార్నింగ్ ఇచ్చింది. ‘వైరస్‌ను ప్రవేశపెట్టే కరపత్రాలను మా రిపబ్లిక్లోకి పంపే పనిని శత్రువులు మానుకోవాలి. ఇది కొనసాగిస్తే వైరస్‌ను మాత్రమే కాకుండా దక్షిణ కొరియా అధికారులను కూడా నిర్మూలించేలా మేం ప్రతిస్పందిస్తాం’ అని హెచ్చరించింది. అధికార కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ ఈ మేరకు గురువారం వెల్లడించింది. అయితే కిమ్ ఎప్పుడు అనారోగ్యానికి గురయ్యారు, ఆయన జ్వరానికి కారణం ఏమిటన్నది పేర్కొనలేదు.
మరోవైపు ఉత్తర కొరియాలో కరోనా వైరస్ విజృంభిస్తున్నది. ఆ దేశ ప్రజలు పెద్ద సంఖ్యలో జ్వరం బారినపడుతున్నారు. అయితే కరోనాను పూర్తిగా నియంత్రించినట్లుగా కిమ్ ప్రకటించారు. కాగా, కరోనా టెస్టులు నిర్వహించని ఉత్తర కొరియా, కరోనాను జ్వర వ్యాధిగా వ్యవహరిస్తున్నది. అలాగే ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ప్రకారం, ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించని రెండు దేశాల్లో ఉత్తర కొరియా ఉన్నది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Laxma Reddy | రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కాంగ్రెస్ : ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి
Niranjan Reddy | పాలనా సంస్కరణలలో నూతన ఒరవడి సృష్టించిన కేసీఆర్ : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
CJP protest | ఇంటర్నెట్ ఆపొద్దు.. మెట్రో రైళ్లు నడపండి.. సీజేపీ నిరసనల వేళ కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
Tirumala | తిరుమలలో శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం
Assam Girl | అసోం యువతి మృతి కేసులో ట్విస్ట్.. రైల్వే ట్రాక్ పక్కనే మరో డెడ్‌బాడీ..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

