కీవ్: ఉక్రెయిన్(Ukraine) కిల్ లిస్టు జాబితాలో ఉత్తర కొరియా నేత కిమ్ జాంగ్ ఉన్(Kim Jong) పేరు ఉన్నట్లు తెలుస్తోంది. రష్యాకు సహకారం అందిస్తున్న నేపథ్యంలోనే కిమ్‌ను కిల్ లిస్టు జాబితాలో చేర్చారు. ఉక్రెయిన్ ప్రభుత్వంతో లింకు ఉన్న వెబ్సైట్ మిరోట్వోరెట్స్లో కిమ్ పేరును హిట్ లిస్టులో చేర్చారు. సాధారణంగా ఉక్రెయిన్‌తో వైరం ఉన్న దేశాలు, నేతల పేర్లను ఆ సైట్లో పొందుపరుస్తుంటారు. రష్యాకు సహకరిస్తున్న యుద్ధ నేరస్థుడిగా కిమ్ గురించి ఆ సైట్ డేటాబేస్‌లో రాశారు. మానవ హక్కుల ఉల్లంఘన, న్యూక్లియర్ బ్లాక్‌మెయిల్‌కు పాల్పడిన కిమ్‌పై అనేక నాగరిక దేశాలు ఆంక్షలు విధించినట్లు ఆ సైట్లో పేర్కొన్నారు.
కిమ్ చెన్ యెన్ అన్న పేరుతో కిమ్ పేరును ఆ సైట్లో రాసినట్లు తెలుస్తోంది. మిరోట్వోరెట్స్ అంటే శాంతికాముకులు అని అర్థం. రష్యాకు ఆయుధాలను సరఫరా చేసినట్లు కిమ్‌పై అమెరికా రిపోర్టు ఇచ్చిందని ఆ సైట్లో పేర్కొన్నారు. ఉక్రెయిన్‌కు శత్రువులు అయిన వారి జాబితాను మిరోట్వోరెట్స్ సైట్లో పబ్లిష్ చేస్తారు. ఆ సైట్లో పేర్లు ఉన్న కొందర్ని ఇటీవల హతమార్చారు కూడా. ప్రస్తుతం రష్యా పర్యటనలో ఉన్న కిమ్ ఆ దేశంలో అనేక ప్రదేశాలను విజిట్ చేశారు. పుతిన్‌తోనూ ఆయన భేటీ అయ్యారు.