ఆక్లాండ్, నవంబర్ 17 : కెనడాలో రెచ్చిపోతున్న ఖలిస్థాన్ వేర్పాటువాదులు, మద్దతుదారులు.. ఇప్పుడు న్యూజిలాండ్‌లోనూ భారత్‌ను టార్గెట్ చేశారు. ఆదివారం ఆక్లాండ్ నగరంలో ఖలిస్థాన్ ఏర్పాటుపై ‘రిఫరెండం’ను నిర్వహించటం సంచలనం రేపింది. వివాదాస్పద ‘రిఫరెండం’కు న్యూజిలాండ్ ప్రభుత్వం అనుమతి ఇవ్వటంపై ఆ దేశంలోని ప్రవాస భారతీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘సిక్స్ ఫర్ జస్టిస్’ నేతృత్వం వహించిన ఈ రిఫరెండానికి న్యూజిలాండ్ అనుమతులు ఇవ్వటం పలు అనుమానాలకు దారితీసింది. దీనిపై ఆక్లాండ్‌లోని ప్రభుత్వ యంత్రాంగం స్పందిస్తూ, న్యూజిలాండ్ భావ ప్రకటనా స్వేచ్ఛకు కట్టుబడిన దేశంగా పేర్కొన్నది.