US Apology: ఆ దాడి నిజంగా తప్పిదమే.. క్షమాపణలు చెప్పిన యూఎస్ ఆర్మీ
US Apology : ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌లో గత నెల 29 న జరిగిన డ్రోన్ దాడి తీవ్రమైన తప్పదిమని అమెరికా భావిస్తున్నది. ఇందుకు అమెరికా ఆర్మీ క్షమాపణ...

వాషింగ్టన్ : ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌లో గత నెల 29 న జరిగిన డ్రోన్ దాడి తీవ్రమైన తప్పదిమని అమెరికా భావిస్తున్నది. ఇందుకు అమెరికా ఆర్మీ క్షమాపణ (US Apology) చెప్పింది. డ్రోన్ ఈ దాడిలో ఏడుగురు చిన్నారులు సహా 10 మంది ఆఫ్ఘన్ పౌరులు మరణించారని కూడా అమెరికా తొలిసారి చెప్పింది. కాబూల్‌లో డ్రోన్ దాడి అనుమానిత ఐసిఎస్ ఆపరేషన్ లక్ష్యంగా జరిగిందని యూఎస్ ఆర్మీ సెంట్రల్ కమాండ్ అధిపతి జనరల్ కెన్నెత్ మెకెంజీ చెప్పారు. కాబూల్ విమానాశ్రయంపై ఐసిఎస్ దాడి చేయాలని యోచిస్తున్నట్లు యూఎస్ ఇంటెలిజెన్స్‌కు బలమైన సమాచారం ఉన్నది. అయితే, పొరపాటుగా ఐఎస్ఐఎస్ లక్ష్యంగా చేయాలనుకున్న డ్రోన్ దాడి ప్రజలు నివసించే ప్రాంతంలో జరిగినట్లు తెలుస్తున్నది.
కాబూల్‌లో జరిగిన డ్రోన్ దాడిపై విచారణ జరిపిన తర్వాత అమెరికా ఈ ప్రకటన చేసింది. ఈ ఘటనపై అక్కడి రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ విచారం వ్యక్తం చేశారు. కాబూల్ దాడిలో మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ తప్పిదాన్ని ఒప్పుకుని క్షమాపణలు చెప్తున్నామని, ఈ భయంకరమైన తప్పు నుంచి తప్పనిసరిగా పాఠం నేర్చుకుంటామని హామీ ఇస్తున్నామన్నారు. ఇదే సమయంలో, మరణించిన వారి కుటుంబాలకు ఎలా పరిహారం అందించాలో అమెరికా ప్రభుత్వం అంచనా వేస్తున్నదని జనరల్ కెన్నెత్ మెకెంజీ చెప్పారు.
‘కాబూల్ విమానాశ్రయంపై ఐసిస్ ఉగ్రవాదులు దాడులకు సిద్ధమవుతున్న ప్రదేశాన్ని అమెరికా నిఘా గుర్తించింది. ఐసిస్ ఉపయోగిస్తున్న తెల్లటి టయోటా కరోలా కారుపై నిఘా ఉంచాలని నిఘా సంస్థ సైన్యాన్ని కోరింది. అనంతరం అమెరికా మిలిటరీ ఆ అనుమానిత టయోటా కారును 8 గంటల పాటు ట్రాక్ చేసింది. దాని కదలిక ద్వారా నిర్ణయించిన ప్రాంతంలో దానిని టార్గెట్ చేసింది. కానీ ఈ వాహనం గురించి నిఘా నివేదిక తప్పుగా ఇచ్చింది’ అని కెన్నెత్ మెకెంజీ ఆనాటి డ్రోన్ దాడి విషయాలను వెల్లడించారు. మరోవైపు, తమ డ్రోన్ స్ట్రైక్ నిర్ణయాన్ని మెకంజీ సమర్థించుకున్నారు. కాబూల్ నుంచి యూఎస్ ఎయిర్‌లిఫ్ట్ ఆపరేషన్ సమయంలో ఐసిస్ దాడి ముప్పును దృష్టిలో ఉంచుకుని డ్రోన్ దాడి జరిపినట్లు ఆయన చెప్పారు. అనుమానిత తెల్ల కారులో పేలుడు పదార్థాలు ఉన్నాయని అమెరికా అధికారులు భావించారని మెకెంజీ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
మళ్లీ ఏకమవుతున్న బీజేపీ-శివసేన!
మర్చిపోలేని ఉరి ఘటనకు ఐదేండ్లు
డబ్బానిండా 5 సెంట్ల కాయిన్లు.. ఎందుకిచ్చాడంటే?
14 ఏండ్ల క్రితం కిడ్నాప్.. ఫేస్బుక్ మెసేజ్‌తో కలిసిన తల్లీకూతురు
దగ్గితే చాలు.. వ్యాధేంటో ఈ యాప్ చెప్తుంది!
మనుషుల మాదిరిగా టాయిలెట్ వాడుతున్న ఆవులు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
SBI Data Leak | ఎస్బీఐపై సైబర్ దాడి.. డాటా లీక్.. ఖాతాదారులు ఏం చేయాలంటే
Asian Para Games: స్ప్రింటర్ సిమ్రన్ శర్మకు రెండో గోల్డ్ మెడల్
Bike Accident | అతివేగంతో పోలీస్ వాహనాన్ని ఢీకొట్టిన బైక్.. వీడియో
విద్యపై దృష్టి పెట్టి ఉన్నత లక్ష్యాలను సాధించాలి : జైలర్ సంజీవరెడ్డి
Women Carried Guns To Mumbai | టైగర్ ష్రాఫ్‌పై కాల్పుల కోసం.. ముంబైకు గన్స్ తరలించిన యూపీ మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

