Justin Trudeau : జస్టిన్ ట్రూడో విజయం చాలా కష్టమే..!
Justin Trudeau : మరో ఐదు రోజుల్లో జరుగనున్న ఎన్నికల్లో జస్టిన్ ట్రూడో పార్టీకి విజయావకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఇటీవలి సర్వేల్లో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న లిబరల్ పార్టీ...

వాంకోవర్ : మరో ఐదు రోజుల్లో జరుగనున్న ఎన్నికల్లో జస్టిన్ ట్రూడో (Justin Trudeau) పార్టీకి విజయావకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఇటీవలి సర్వేల్లో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న లిబరల్ పార్టీ వెనుకబడి ఉన్నది. కరోనాతోపాటు అనేక అంశాలపై ప్రజలు ట్రూడోపై ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన విజయం అసాధ్యమని సర్వేలు అంటున్నాయి. మధ్యంతర ఎన్నికల నిర్ణయంపై సొంత పార్టీ నుంచే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల్లో జస్టిన్ ట్రూడో (లిబరల్), ఎరిన్ ఓ టూల్ (కన్జర్వేటివ్), వైవ్స్ ఫ్రాకోయిస్ బ్లాంచెట్ (బ్లాక్ క్యూబికోస్), జగ్మీత్సింగ్ (ఎన్డీపీ), అన్నామీ పాల్ (గ్రీన్) లు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
కెనడాలో ఈనెల 20 న ఎన్నికలు జరుగనున్నాయి. జస్టిన్ ట్రూడే నేతృత్వంలో లిబరల్ పార్టీ మరోసారి అధికారం కోసం పోరాడుతున్నది. ప్రధాని జస్టిన్ ట్రూడో గత నెల 15 న మధ్యంతర ఎన్నికలను ప్రకటించినప్పుడు, కరోనాను విజయవంతంగా నిర్వహించడంతో తమకు సంపూర్ణ మెజారిటీని వస్తుందని భావించారు. ఇప్పుడు ఓటింగ్‌కు వారం ముందు పరిస్థితులు తలకిందులయ్యాయి. ట్యూడో ఆశలు అడియాసలయ్యేలా కనిపిస్తున్నాయి. ట్రూడో ప్రాతినిధ్యం వహించే లిబరల్ పార్టీ ఎన్నికల ప్రచారం బలంగా లేదని, అనేక అంశాల్లో ప్రజలు అతడిపై కోపంగా ఉన్నారని స్థానిక వార్తా పత్రికలు నివేదిస్తున్నాయి.
జస్టిన్ ట్రూడో 2015 నుంచి అధికారంలో ఉన్నారు. 2019 లో రెండోసారి ప్రధాని అయినప్పుడు, ప్రభుత్వం మైనారిటీలో ఉన్నది. ఫలితంగా ముఖ్యమైన బిల్లులను ఆమోదించడానికి లేదా విధాయ నిర్ణయాలు తీసుకోవడానికి వారు ప్రతిపక్ష పార్టీల సహాయం తీసుకోవాల్సి వచ్చింది. కరోనాను నిలువరించడంలో టీకా డోసులు అందించే కార్యక్రమం విజయవంతం అయినప్పటికీ, అతని ప్రభుత్వం పట్ల సామాన్య ప్రజలలో కొంత కోపం కనిపిస్తున్నదని నిపుణులు అంటున్నారు. 49 ఏళ్ల ట్రూడోకు సంపూర్ణ మెజారిటీ కోసం 38 శాతం ఓట్లు అవసరం కాగా, ఇప్పుడు ఈ సంఖ్య సాధించడం ఆయనకు చాలా కష్టంగా ఉన్నదని వారంటున్నారు. అలాగే, మధ్యంతర ఎన్నికలకు వెళ్లడంపై కూడా ఆయన సొంత పార్టీలోనే చాలా మంది విముఖత చూపారు. ప్రస్తుతం కన్జర్వేటీవ్ పార్టీ ముందంజలో ఉన్నట్లు సర్వేలు చెప్తున్నాయి.
ఇవి కూడా చదవండి..
అసెంబ్లీ బరిలోకి ప్రియాంకగాంధీ వాద్రా!
ఈనెల 26 న శ్రీనగర్ దాల్ సరస్సుపై తొలి ఎయిర్‌షో
గాంధీ జయంతి కల్లా గాడ్సే విగ్రహం ప్రతిష్ట
నీరజ్ జావెలిన్ కోచ్ ఉవే హూన్ తొలగింపు
బీఏలో ఆప్షనల్ సబ్జెక్ట్‌గా ‘రామ్‌చరిత్‌మానస్’.. ఎక్కడంటే?
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Diwali Celebrations | దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా దీపావళి.. మనకు తెలియని పండుగ విశేషాలివే!
Janhvi Kapoor | కోలీవుడ్‌పై ఫోకస్ పెంచిన బాలీవుడ్ బ్యూటీ.. తమిళ సినిమాలపై ప్రశంసల వర్షం వెనుక అసలు కారణం ఇదేనా?
Bigg Boss 10 | బిగ్ బాస్‌లో ఈ వారం ఎలిమినేషన్ లేదా.. దీపావళి స్పెషల్‌గా నాగార్జున భారీ ట్విస్ట్
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

