వాషింగ్టన్, మార్చి 14: చాట్‌జీపీటీ ప్రభావం జాబ్మార్కెట్పై ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు అమెరికాకు చెందిన రెజ్యూమ్‌బిల్డర్.కామ్ అనే సంస్థ అక్కడి వెయ్యి కంపెనీలపై ఓ సర్వే జరిపింది. ఇందులో 49 శాతం కంపెనీలు ఇప్పటికే చాట్‌జీపీటీ వినియోగిస్తుండగా, 30 శాతం కంపెనీలు భవిష్యత్తులో వినియోగించుకోవాలనే ప్రణాళికతో ఉన్నాయి. చాట్‌జీపీటీ ఉపయోగిస్తున్న కంపెనీల్లో 48 శాతం కంపెనీలు కొంతమంది ఉద్యోగులను తొలగించినట్టు ఈ సర్వేలో వెల్లడైంది.