July: భగభగ మండిన జూలై.. గరిష్ట ఉష్ణోగ్రతలతో రికార్డు

వాషింగ్టన్: ప్రపంచ వ్యాప్తంగా జూలై ( July ) నెలలో అత్యధిక స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. ఈ విషయాన్ని అమెరికాకు చెందిన నేషనల్ ఓసియానిక్ అండ్ అట్మాస్పియరిక్ అడ్మినిస్ట్రేషన్(ఎన్ఓఏఏ) ఏజెన్సీ తన నివేదికలో చెప్పింది. సాధారణంగా జూలైలో ప్రపంచవ్యాప్తంగా వేడి ఉష్ణోగ్రతలే ఉంటాయని, కానీ ఈ ఏడాది జూలైలో మాత్రం రికార్డులు బద్దలు అయినట్లు ఎన్ఓఏఏ అడ్మినిస్ట్రేటర్ రిక్ స్పినార్డ్ తెలిపారు. జూలైలో గరిష్ఠ స్థాయిలో నమోదు అయిన ఉష్ణోగ్రతలు .. వాతావరణ మార్పులకు సంకేతంగా నిలుస్తున్నట్లు స్పినార్డ్ చెప్పారు. భూమి, సముద్ర ఉపరితలంపై ఆ నెలలో ఉష్ణోగ్రతలు సగటను 0.93 డిగ్రీల సెల్సియస్ పెరిగినట్లు అంచనా వేశారు. గడిచిన 142 ఏళ్లలో జూలైలో ఈ ఏడాదే అత్యంత వేడి దినాలు నమోదు అయినట్లు పరిశోధకులు చెప్పారు. 2016 జూలైలో రికార్డు అయిన ఉష్ణోగ్రతల కన్నా.. 2021 జూలైలో 0.02 డిగ్రీ ఫారన్‌హీట్ అధిక టెంపరేచర్ నమోదు అయ్యింది.
యూరోప్‌కు చెందిన కొపర్నికస్ క్లైమేట్ చేంజ్ సర్వీస్ నివేదిక ప్రకారం ఈ సారి జూలైలో అధిక ఉష్ణోగ్రతలు నమోదు అయినా, ఆ రికార్డు నమోదు కావడం మూడవ సారి అని పేర్కొన్నది. వాస్తవానికి ప్రపంచ వ్యాప్తంగా చాలా భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొని ఉన్నాయని, కొన్ని ప్రాంతాల్లో అధిక వర్షపాతం కురిస్తే, కొన్ని ప్రాంతాల్లో ఎండలు దంచుతున్నాయని ఎన్ఓఏఏ డైరక్టర్ తెలిపారు. కార్బన్‌డైయాక్సైడ్, గ్రీన్ హౌజ్ గ్యాస్‌లను తగ్గించకుంటే పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారుతుందని ఆయన హెచ్చరించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Hottest Month
- July
- NOAA
- US Agency
RELATED ARTICLES
తాజా వార్తలు
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

