ఆలిస్‌తో సంబంధంపై .. ఎన్విడియాను తప్పుదోవ
వివాహేతర సంబంధాలు, గూఢచారితో సంబంధాల ఆరోపణలతో పదవికి రాజీనామా చేసి కంపెనీతో బంధాన్ని అవమానకరంగా ముగించిన అమెరికా టెక్ దిగ్గజం, ఎన్విడియా మాజీ సీఈవో జెన్సన్ హువాంగ్ నకు సంబంధించి మరిన్ని ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి.
- ఆమెతో వ్యాపార సంబంధమేనన్న జెన్సన్
శాన్ఫ్రాన్సిస్కో, నవంబర్ 14: వివాహేతర సంబంధాలు, గూఢచారితో సంబంధాల ఆరోపణలతో పదవికి రాజీనామా చేసి కంపెనీతో బంధాన్ని అవమానకరంగా ముగించిన అమెరికా టెక్ దిగ్గజం, ఎన్విడియా మాజీ సీఈవో జెన్సన్ హువాంగ్ నకు సంబంధించి మరిన్ని ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. చైనా గూఢచారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న చైనీస్ వ్యాపారవేత్త ఆలిస్ హువాంగ్‌తో తన వివాహేతర సంబంధం స్వభావంపై జెన్సన్ కంపెనీ ఉన్నతాధికారులను తప్పుదోవ పట్టించిన విషయాన్ని రాయిటర్స్ వెల్లడించింది.
ఇద్దరు ముఖ్య వ్యక్తులను ఉటంకిస్తూ ప్రధాన న్యాయ సలహాదారు టిమ్ టెటర్, చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అలిసన్ వ్యాగన్ ఫెల్డ్ సహా పలువురు నేతలకు ఆయన తప్పుడు వివరణలు ఇచ్చినట్లు రాయిటర్స్ పేర్కొంది. ఆమెతో తన సంబంధం కేవలం వ్యాపారమేనని ఆయన తెలిపారు. తాము పరిశీలించిన పలు అంతర్గత సందేశాలు ఈ విషయాన్ని సూచిస్తున్నాయని తెలిపింది. చైనా కోసం గూఢచర్యం చేసి ఉండవచ్చన్న అనుమానంతో ఆలిస్పై అమెరికా దర్యాప్తు చేస్తున్నది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్

