వాషింగ్టన్: ఆయన ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు. ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ వ్యవస్థాపకుడు. వేల కోట్లు ఖర్చు పెట్టి మంగళవారమే సొంత రాకెట్లో స్పేస్‌లోకి వెళ్లి వచ్చారు. ఆయన పేరు జెఫ్ బెజోస్. 11 నిమిషాల ప్రయాణానికి వేల కోట్లు ఖర్చు పెట్టడమే కాకుండా.. కిందికి వచ్చిన తర్వాత ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడాయన మెడకే చుట్టుకుంటున్నాయి. తన స్పేస్ ట్రిప్ విజయవంతంగా ముగిసిన తర్వాత బెజోస్ మీడియాతో మాట్లాడారు. ప్రతి అమెజాన్ ఉద్యోగి, అమెజాన్ కస్టమర్‌కు కృతజ్ఞతలు చెబుతున్నారు. దీనికి డబ్బు చెల్లించింది మీరే అని బెజోస్ అన్నారు.
కానీ ఈ కామెంట్స్ రివర్స్ అయ్యాయి. ప్రపంచంలోనే రిచెస్ట్ అయినా కూడా కొన్నేళ్లుగా బెజోస్ ఎప్పుడూ పన్నులు కట్టడం లేదని తెలుసు కదా. దీనికితోడు అమెజాన్‌లో వర్కర్ల నుంచి శ్రమ దోపిడీ ఉంటుందన్న ఆరోపణలు ఉన్నాయి. కనీసం తినడానికి, ఒక్కోసారి బాత్రూమ్ వెళ్లడానికి కూడా సమయం ఉండదని అమెజాన్‌లో పనిచేసే వాళ్లు చెబుతుంటారు. ఈ విషయాన్నే గుర్తు చేస్తూ ట్విటర్లో బెజోస్‌కు వ్యతిరేకంగా ఎన్నో కామెంట్స్ వస్తున్నాయి.
అవును, అమెజాన్ వర్కర్లే దీనికి చెల్లించారు. తక్కువ జీతాలు, దారుణమైన పరిస్థితుల్లో పని చేస్తున్నారు. ఈ మహమ్మారి సమయంలోనూ డెలివరీ బాయ్స్‌కు కనీసం ఇన్సూరెన్స్ చేయించలేదు అని అమెరికా చట్టసభ ప్రతినిధి అలెజాండ్రియా ఒకాసియో ట్విటర్లో మండిపడ్డారు. ఇక సెనేటర్ ఎలిజబెత్ వారెన్ స్పందిస్తూ.. మీరు పన్నులు కట్టకుండా అమెరికన్లు చెమటోడ్చి సంపాదించి కట్టిన పన్నులతో వెళ్లారు. వాళ్లందరికీ థ్యాంక్స్ చెప్పడం మరచిపోయారు అని విమర్శించారు. అటు కెనడాలోని న్యూ డెమొక్రటిక్ పార్టీ నేత జగ్మీత్ సింగ్ కూడా ట్వీట్ చేశారు.
బెజోస్ స్పేస్ ట్రిప్ 11 నిమిషాలు సాగింది. ఈ మహమ్మారి సమయంలో బెజోస్ సంపద ప్రతి 11 నిమిషాలకు 16 లక్షల డాలర్లు పెరిగింది. అయినా ట్రూడో ప్రభుత్వం మాత్రం అమెజాన్‌కు పైసా పన్ను వేయలేదు అని ఆయన మండిపడ్డారు. ఇలాంటి ప్రముఖులే కాకుండా ట్విటర్లో చాలా మంది బెజోస్ కామెంట్స్‌పై ప్రతికూలంగానే స్పందించారు.
Yes, Amazon workers did pay for this – with lower wages, union busting, a frenzied and inhumane workplace, and delivery drivers not having health insurance during a pandemic.
— Alexandria Ocasio-Cortez (@AOC) July 20, 2021
And Amazon customers are paying for it with Amazon abusing their market power to hurt small business. https://t.co/7qMgpe8u0M
Jeff Bezos forgot to thank all the hardworking Americans who actually paid taxes to keep this country running while he and Amazon paid nothing. https://t.co/tjOeCWbUA8
— Elizabeth Warren (@ewarren) July 20, 2021
Jeff Bezos's space flight lasted 11 minutes
— Jagmeet Singh (@theJagmeetSingh) July 20, 2021
During the pandemic, every 11 minutes, he got about 1.6 million dollars richer
All while, Justin Trudeau allowed Amazon to pay $0 in taxes
It's time the ultra-rich pay their fair sharehttps://t.co/uhILFSSfxw