న్యూయార్క్: కన్జర్వేటివ్ నేత ఛార్లీ కిర్క్ భార్య, టర్నింగ్ పాయింట్ యూఎస్ఏ సీఈవో ఎరికా కిర్క్ ను అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్(JD Vance) పెళ్లి చేసుకోనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆ ఇద్దరూ ఇటీవల హగ్గింగ్ చేసుకున్న వీడియోలు ఆన్లైన్లో వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో ఆ ఫోటోలు, వీడియోలపై తీవ్రస్థాయిలో ఊహాగానాలు వస్తున్నాయి. రెండు రోజుల క్రితం టర్నింగ్ పాయింట్ యూఎస్ఏ ప్రోగ్రాంలో ఇద్దరూ పాల్గొన్నారు. జేడీ వాన్స్‌ను స్టేడియం మీదకు ఎరికా ఆహ్వానించారు. ఆ సమయంలో ఆ జంట హగ్ చేసుకున్నది. దీంతో ఆ స్టంట్‌కు చెందిన క్లిప్పులు, ఫోటోలు ఆన్లైన్లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
Vance announces divorce, marries Charlie Kirk’s widow by the end of 2026. https://t.co/waBOG8EYXi
— Shannon Watts (@shannonrwatts) October 30, 2025
ఇక న్యూయార్క్ టైమ్స్‌కు చెందిన రచయిత షానన్ వాట్స్ ఏకంగా బాంబు పేల్చింది. ఎరికా, వాన్స్ ఫోటోలను తన ఎక్స్ అకౌంట్లో పోస్టు చేసి దానికి ఆమె ఓ వివాదాస్పద కామెంట్ పెట్టింది. వచ్చే ఏడాది చివరి నాటికి జేడీ వాన్స్ విడాకులు తీసుకుని , ఎరికాను మ్యారేజ్ చేసుకుంటాడని ఆ రచయిత తన పోస్టులో అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఆ పోస్టుకు ఇప్పటికే 85 లక్షల వ్యూవ్స్ వచ్చాయి.
అయితే టర్నింగ్ పాయింట్ యూఎస్ఏ కార్యక్రమంలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తన భార్య ఉష గురించి చేసిన కొన్ని వ్యాఖ్యలు పెను సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఏదో ఒక రోజు తన భార్య ఉష.. క్రైస్తవాన్ని స్వీకరిస్తుందని జేడీ వాన్స్ ఆ సభలో అభిప్రాయపడ్డారు. హిందూ మతానికి చెందిన భార్య ఉష వల్ల రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు జేడీ వాన్స్‌కు సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నట్లు కొందరు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 2028 దేశాధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడేందుకు జేడీ వాన్స్ ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.
భార్య ఉషపై చేసిన వ్యాఖ్యల విషయంలో జేడీ వాన్స్ వెంటనే సరిదిద్దుకున్నారు. కానీ శనివారం తన ఎక్స్ అకౌంట్లో జేడీ వాన్స్ ఓ స్టేట్మెంట్ పోస్టు చేశారు. తన భార్యకు మతం మారే ఆలోచన లేదన్నారు. నాకు తెలిసిన ఉత్తమ వ్యక్తి ఉష అని పేర్కొన్నారు. కానీ తన పోస్టులో కిర్క్ ఎరికా గురించి నేరుగా ప్రస్తావించలేకపోవడం గమనార్హం. ఆన్లైన్ ఊహాగానాలకు ఎలా బ్రేక్ పడుతుందో వేచి చూడాల్సిందే.