టోక్యో: జపాన్ సైంటిస్టులు శీతలీకరణ అవసరం లేకుండా నిల్వ చేయగల సార్వత్రిక కృత్రిమ రక్తాన్ని అభివృద్ధి చేశారు. నిజమైన రక్తానికి ప్రత్యామ్నాయంగా పనిచేయగల ఈ రక్తాన్ని (సింథటిక్ బ్లడ్) ‘నారా మెడికల్ యూనివర్సిటీ’ పరిశోధకులు సృష్టించారు.
ఈ ఆవిష్కరణ ఎమర్జెన్సీ వైద్య చికిత్సలో అనూహ్య మార్పులకు నాంది పలుకుతుందని, రక్త కొరతను తీర్చగలదని పరిశోధకులు భావిస్తున్నారు. ఈ సంవత్సరం క్లినికల్ ట్రయల్స్ విజయవంతమైతే, 2030 నాటికి వైద్య రంగంలో కృత్రిమ రక్తాన్ని ప్రవేశపెట్టిన తొలి దేశంగా జపాన్ గుర్తింపు అందుకోనున్నది.