Molecular Plastics | టోక్యో: జపాన్ శాస్త్రవేత్తలు కొత్త రకం ప్లాస్టిక్‌ను అభివృద్ధి చేశారు. దీనిని ఉపయోగించుకునే సమయంలో అది దృఢంగానే ఉంటుంది. కానీ అవసరం తీరిపోయిన తర్వాత దానిని ఉప్పు నీటిలో వేస్తే, వేగంగా కరిగిపోతుంది. హానికరం కానటువంటి మిశ్రమాలుగా విడిపోతుంది. దీని ప్రభావం పర్యావరణంపై తక్కువగా ఉంటుంది.
ఆర్ఐకేఈఎన్ సెంటర్ ఫర్ ఎమర్జెంట్ మాటర్ సైన్స్‌లోని రీసెర్చర్ టకుజో అయిడా నేతృత్వంలోని బృందం ఈ ప్లాస్టిక్‌ను అభివృద్ధి చేసింది. భూమిలో కాని, నీటిలో కాని కరగని ప్లాస్టిక్స్‌తో ఏర్పడుతున్న సమస్యను పరిష్కరించడం కోసం ఈ బృందం సుప్రా మాలిక్యులర్ ప్లాస్టిక్స్‌తో ప్రయోగాలు చేసింది. క్రాస్-లింక్డ్ సాల్ట్ బ్రిడ్జెస్గా ఏర్పడే రెండు అయానిక్ మోనోమర్స్ను కలిపింది. రెండు మోనోమర్లను మిశ్రమం చేయడం ద్వారా ఈ కొత్త ప్లాస్టిక్స్‌ను అభివృద్ధి చేశారు.