
టోక్యో, అక్టోబర్ 1: నగలొద్దు. సొమ్ములొద్దు. మేడలొద్దు. రాణీ వైభోగాలు వద్దు. నీ ప్రేమే నాకు చాలంటూ జపాన్ రాకుమారి మాకో తన ప్రియుడు, క్లాస్మేట్ కొమురోను పెండ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యారు. సామాన్యుడైన కొమురోను పెండ్లి చేసుకొంటే మాకో తన రాజకుమార్తె హోదాను కోల్పోతారు. వివాహం సందర్భంగా ఆనవాయితీగా లభించే రూ.10 కోట్లు కూడా రావు. కొమురో కోసం వీటన్నింటినీ వదులుకోవడానికి మాకో సిద్ధపడ్డారు. ఈ నెల 26న వివాహం చేసుకోనున్నట్టు ప్రకటించారు. పెండ్లి కూడా రాజరికపు సంప్రదాయాలతో కాకుండా సాదాసీదాగా చేసుకోవాలని నిర్ణయించుకొన్నారు.