నిమిషం ఆలస్యమైందని జీతం కట్.. నష్టపరిహారం కోరిన రైలు డ్రైవర్

టోక్యో: జపాన్‌కు చెందిన రైలు డ్రైవర్ ఆ దేశ రైల్వేశాఖపై నష్టపరిహారం కేసు దాఖలు చేశాడు. రైలును నిమిషం ఆలస్యంగా నడిపినందుకు రైల్వే పశ్చిమ శాఖ సదరు డ్రైవర్ జీతాన్ని కట్ చేసింది. సుమారు 56 యెన్లు అంటే, 0.49 డాలర్ల జీతాన్ని రైల్వేశాఖ ఆ డ్రైవర్‌కు ఇవ్వలేదు. దీంతో మనస్థాపానికి గురైన ఆ డ్రైవర్ ఇప్పుడు కోర్టును ఆశ్రయించారు. జీతాన్ని ఎలా తగ్గిస్తారని అతను 20 వేల డాలర్ల నష్టపరిహారాన్ని కోరాడు. ఇంతకీ ఏం జరిగిందో తెలుసుకుందాం.
గత ఏడాది జూన్‌లో ఓ డ్రైవర్ ఒక నిమిషం ఆలస్యంగా రైలును నడిపాడు. ఒకయామా స్టేషన్ నుంచి ఖాళీ రైలును తీసుకువెళ్లాల్సిన అతను.. పొరపాటును మరో ఫ్లాట్‌ఫామ్‌కు వెళ్లాడు. అయితే తన పొరపాటును గ్రహించి మళ్లీ అతను తాను తీసుకువెళ్లాల్సిన రైలు ఉన్న ఫ్లాట్‌ఫామ్‌కు చేరుకున్నాడు. కానీ ఇక్కడ రెండు నిమిషాలు వృధా అయ్యింది. చివరకు ఒక నిమిషం తేడాతో అతను తన రైలును డిపోకు తీసుకువెళ్లాడు. నిమిషం ఆలస్యం అయ్యిందన్న కారణంతో రైల్వేశాఖ ఆ డ్రైవర్ జీతంలో కోత విధించింది. అంతేకాదు ఆ సమయంలో అతనేమీ పనిచేయలేదని కూడా చెప్పింది.
రైల్వేశాఖ తీరు నచ్చని ఆ డ్రైవర్ ఒకయామా జిల్లా కోర్టులో నష్టపరిహారం కేసును నమోదు చేశాడు. జపాన్‌లో రైళ్లు కచ్చితంగా సమయానికి నడుస్తాయి. 2017లో ఓ రైలు 20 సెక్లను ముందుగా వెళ్లినందుకు రైల్వేశాఖ భారీ క్షమాపణ లెటర్‌ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఒకవేళ ఆలస్యం అయిదు నిమిషాలు దాటితే అప్పుడు రైల్వే శాఖ ఓ లేఖను ఇస్తుంది. ఆ సర్టిఫికేట్‌ను తమ ఆలస్యానికి కారణంగా చూపవచ్చు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
IND vs WI | బౌలర్లకు మరో సవాల్.. పొట్టి సిరీస్‌లో నేడు కీలక మ్యాచ్..!
Dharman | రజనీకాంత్ ‘ధర్మన్’పై భారీ అంచనాలు.. 2027 సంక్రాంతి నుంచి వేసవికి వాయిదా?
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

