టోక్యో, సెప్టెంబర్ 29: జపాన్ కొత్త ప్రధానిగా ఫ్యూమియో కిషిదా బాధ్యతలు చేపట్టనున్నారు. అధికార పార్టీని ముందుండి నడిపించే వ్యక్తి కోసం బుధవారం జరిగిన ఎన్నికల్లో కిషిదా విజయం సాధించారు. దీంతో సోమవారం ఆయన ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. కరోనాను నియంత్రించడంలో ప్రస్తుత ప్రధాని సుగా విఫలమయ్యారని, దీంతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొన్నదని భావించిన లిబరల్ డెమోక్రటిక్ పార్టీ కొత్త నేతను ఎన్నుకోవడానికి ఎన్నికలు నిర్వహించింది. నాయకత్వ పదవికి పలువురు పోటీ పడినప్పటికీ చాలా మంది కిషిదా వైపే మొగ్గు చూపారు.