Japan Earthquake | జపాన్ను వరుస భూకంపాలు (Japan Earthquake) వణికించాయి. సోమవారం మధ్యాహ్నం సమయంలో 20 కంటే ఎక్కువసార్లే భూమి కంపించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. 4 కంటే ఎక్కువ తీవ్రతతో 21 సార్లు భూమి కంపించినట్లు తెలిపింది.
సోమవారం మధ్యాహ్నం ఇషికావా రాష్ట్రంలోని నోటో ప్రాంతంలో వరుసగా భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. మొదట 4:06 గంటల ప్రాంతంలో (స్థానిక కాలమానం ప్రకారం) 5.7 తీవ్రతతో ప్రకంపనలు మొదలయ్యాయి. ఆ తర్వాత 4:10 గంటలకు 7.6 తీవ్రతతో బలమైన ప్రకంపనలు సంభవించాయి. 4:18 గంటల సమయంలో 6.1 తీవ్రతతో, 4:23 గంటలకు 4.5 తీవ్రతతో, 4:29 గంటలకు 4.6 తీవ్రతతో, 4:32 గంటలకు 4.8 తీవ్రతతో భూప్రకంపనలు నమోదయ్యాయి. ఆ తర్వాత కూడా 4 కంటే ఎక్కువ తీవ్రతతో భూమి కంపించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.
ఐదుగురికి గాయాలు..
స్థానిక మీడియా రిపోర్ట్స్ ప్రకారం.. భారీ భూకంపం కారణంగా జపాన్‌లో ఐదుగురు గాయపడ్డారు. సుమారు 34వేల ఇళ్లకు పవర్ కట్ లేదు. అనేక బిల్డింగ్లు కూలిపోవడంతో శిథిలాల కింద పలువురు చిక్కుకున్నారు. అయితే, ఈ భూకంపం ఘటనలో ప్రాణ నష్టానికి సంబంధించి ఇప్పటి వరకూ ఎలాంటి సమాచారం రాలేదు.
సునామీ హెచ్చరికలు
మరోవైపు భారీ భూకంపం నేపథ్యంలో జపాన్ వాతావరణ సంస్థ సునామీ హెచ్చరికలు జారీ చేసింది. తీర రాష్ట్రాలైన ఇషికావా, నీగటి, తొయామా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ముందు జాగ్రత్తగా ప్రజలు వెంటనే తీర ప్రాంతాలను వదిలి ఎత్తైన ప్రదేశాలకు వెళ్లాలని ఆదేశించింది. జపాన్ తీరం వెంబడి భూకంపం కేంద్రానికి 300 కి.మీ పరిధిలో ప్రమాదకర అలలు వచ్చే అవకాశం ఉందని సునామీ హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. ఇషికావాలో సుమారు 5 మీటర్ల ఎత్తు వరకు సునామీ (tsunami) అలలు వచ్చే అవకాశాలు ఉన్నట్లు వెదర్ ఏజెన్సీ తన వార్నింగ్‌లో తెలిపింది. హొక్కియాడా నుంచి నాగసాకి మధ్య జపాన్ సముద్రతీరం వెంట సుమారు మూడు మీటర్ల ఎత్తులో సునామీ అలలు వచ్చే అకాశాలు ఉన్నాయి.
Also Read..
Tsunami | జపాన్ను తాకిన సునామీ అలలు.. వీడియోలు
tsunami | భారీ భూకంపంతో వణికిపోయిన జపాన్.. రష్యా, ఉత్తర కొరియాకూ సునామీ హెచ్చరికలు
Earthquake | జపాన్‌లో 7.4 తీవ్రతతో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు