అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ని ట్విట్టర్లోకి మళ్లీ ఆహ్వానిద్దామా? వద్దా? అనే విషయమై యూజర్లు ఓటింగ్ ద్వారా తమ అభిప్రాయాన్ని వెల్లడించాలని ట్విట్టర్ సీఈఓ ఎలన్ మస్క్ శనివారం కోరిన సంగతి తెలిసిందే. దాంతో, చాలామంది ట్విట్టర్ పోలింగ్‌లో పాల్గొంటున్నారు. ప్రతి గంటకు 10 లక్షల ఓట్లు వస్తున్నాయని మస్క్ తెలిపాడు. ట్విట్టర్ పోలింగ్‌కు ముందు ప్రజల వాయిస్.. దేవుడి వాయిస్ అంటూ ఎలన్ మస్క్ ట్వీట్ చేశాడు.
2020లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఓడిపోయారు. దాంతో, 2021లో వాషింగ్టన్ డీసీలోని క్యాపిటల్ బిల్డింగ్ మీద ఆయన మద్దతుదారులు దాడికి దిగారు. దాంతో, ఇలాంటి హింసాత్మక సంఘటనలు మరిన్ని జరిగే అవకాశం ఉందని ట్విట్టర్ ట్రంప్ ట్విట్టర్ ఖాతాను జనవరి శాశ్వతంగా తొలగించింది. అయితే, తాను 2024లో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తానని ట్రంప్ ఈమధ్యే మధ్యంతర ఎలక్షన్ ర్యాలీలో ప్రకటించాడు. ఈ నేపథ్యంలో ట్రంప్ ట్విట్టర్ అకౌంట్‌ని పునరుద్ధరించడంపై మస్క్ పోలింగ్ నిర్వహించడం గమనార్హం.
మస్క్ ట్విట్టర్‌ని కొనుగోలు చేశా చాలామంది ఉద్యోగులను తొలగించాడు. అంతేకాదు బ్లూటిక్, పెయిడ్ వీడియో వంటి కొత్త ఫీచర్ల ద్వారా ఆదాయం పెంచుకునేందుకు మస్క్ ప్రయత్నిస్తున్నాడు.