స్పెయిన్ : ప్రపంచంలోనే తొలిసారిగా ఆశ్చర్యకరమైన కేసు ఒకటి వెలుగులోకి వచ్చింది. ఒకే వ్యక్తికి ఒకేసారి కరోనా, మంకీపాక్స్తోపాటు హెచ్ఐవీ నిర్ధారణ అయ్యింది. ఇటలీకి చెందిన ఓ వ్యక్తిలో ఏకకాలంలో మంకీపాక్స్, కరోనా, హెచ్ఐవీని ఇటాలియన్ పరిశోధకులు ఏకకాలం గుర్తించారు. సదరు వ్యక్తి ఇటీవల ఐదు రోజుల స్పెయిన్‌కు వెళ్లి ఇటలీకి తిరిగి వచ్చాడు.
జర్నల్ ఆఫ్ ఇన్ఫెక్షన్లో ప్రచురితమైన నివేదిక ప్రకారం.. స్పెయిన్ నుంచి తిరిగి వచ్చిన తొమ్మిది రోజుల తర్వాత 36 సంవత్సరాల సదరు వ్యక్తికి జ్వరం, గొంతునొప్పి, తలనొప్పి, నడుము వాపు తదితర సమస్యలతో బాధపడుతున్నాడు. ఈ లక్షణాలు కనిపించిన అనంతరం అతనికి మూడు రోజుల తర్వాత కరోనా సోకినట్లు గుర్తించారు.
ఆ తర్వాత కొద్దిగంటల్లోనే సదరు వ్యక్తి ఎడమ చేతిపై దద్దుర్లతో పాటు బొబ్బలు కనిపించాయి. ప్రస్తుతం సిసిలీ తూర్పుతీరంలో ఉన్న కాటానియాలోని ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత ఆరోగ్య పరీక్షలు చేయగా.. రిపోర్టుల్లో హెచ్ఐవీ పాజిటివ్‌గానూ తేలింది. సదరు వ్యక్తి 2021లో హెచ్ఐవీ పరీక్ష చేయించుకోగా.. నెగెటివ్‌గా వచ్చింది.