టెల్ అవివ్: ఇరాన్లో ఉన్న అరక్ న్యూక్లియర్ హెవీ వాటర్ రియాక్టర్(Arak Nuclear Reactor)పై .. ఇజ్రాయిల్ వైమానిక దళం బాంబు దాడి చేసింది. ఈ విషయాన్ని ఐడీఎఫ్ కన్ఫర్మ్ చేసింది. అయితే ప్రస్తుతం అరక్ న్యూక్లియర్ రియాక్టర్ .. ఇన్‌యాక్టివ్‌గా ఉన్నది. అత్యంత శుద్దీకరించిన ప్లుటోనియంను ఆ రియాక్టర్లో తయారు చేస్తున్నట్లు ఇజ్రాయిలీ రక్షణ దళాలు వెల్లడించాయి. ప్లుటోనియం ద్వారా అణ్వాయుధాలను రూపొందించనున్నారు.
ప్లుటోనియం ప్రొడక్షన్‌కు కారణమైన కేంద్రంపై దాడి జరిగినట్లు ఇజ్రాయిల్ ఛెప్పింది. దీని వల్ల మళ్లీ రియాక్టర్‌ను కానీ న్యూక్లియర్ వెపన్స్ డెవలప్మెంట్ కోసం కానీ ఆ రియాక్టర్‌ను వాడరాదన్న ఉద్దేశంతో అటాక్ చేసినట్లు ఐడీఎఫ్ తెలిపింది. ఇజ్రాయిల్ 40 ఫైటర్ విమానాలతో తాజాగా దాడి చేసింది.
అరక్ హెవీవాటర్ రియాక్టర్‌తో పాటు ఇతర మిలిటరీ కేంద్రాలను కూడా ఐడీఎఫ్ టార్గెట్ చేసింది. అరక్తో పాఉ నటాంజ్ అణు కేంద్రంపై కూడా ఇజ్రాయిల్ దాడి చేసింది. ఈ సైట్లో అణ్వాయుధాలకు అవసరమైన కాంపోనెంట్స్ తయారు చేస్తారు.
תקיפות חיל האוויר הלילה באיראן: 40 מטוסי קרב תקפו עשרות מטרות צבאיות עם יותר מ-100 חימושים
צה״ל תקף כור גרעיני שאינו פעיל במרחב אראכ שבאיראן
40 מטוסי קרב של חיל האוויר תקפו במהלך הלילה, בהכוונה מודיעינית מדויקת של אגף המודיעין, עם יותר מ-100 חימושים, עשרות מטרות צבאיות בטהראן… pic.twitter.com/llhYbkFXIF
— צבא ההגנה לישראל (@idfonline) June 19, 2025