Rishi Sunak | రిషి సంపన్నుల ప్రతినిధా..? ఆయన్ను వెంటాడే వివాదాలివి..?!
Rishi Sunak | బ్రిటన్ ప్రధానిగా ఎన్నికవ్వనున్న రిషి సునాక్ సంపన్నుల ప్రతినిధి అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.
Rishi Sunak | బ్రిటన్ ప్రధానిగా లిజ్ ట్రస్ 45 రోజులకే రాజీనామా చేయడంతో యునైటెడ్ కింగ్డమ్ పరిధిలో రాజకీయ అనిశ్చితి నెలకొంది. అధికార కన్జర్వేటివ్ పార్టీ తదుపరి నేత ఎన్నికకు రంగం సిద్ధమైంది. అంతా ఊహించినట్లే జరిగితే బ్రిటన్ తదుపరి ప్రధానిగా రిషి సునాక్ ఎన్నిక దాదాపు ఖరారైనట్లే.. రిషి సునాక్.. కన్జర్వేటివ్ పార్టీలో కొనసాగుతున్నారు. ఆయన ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణమూర్తి కూతురు అక్షిత మూర్తిని పెండ్లాడారు. అంటే ఇన్ఫీ నారాయణమూర్తికి అల్లుడన్న మాట. ఎవరైనా వివాదాలకు అతీతులేం కాదు..
బ్రిటన్‌లోని అధికార కన్జర్వేటివ్ పార్టీ సంప్రదాయ వాదులకు నిలయమైనా వివాదాల్లో నలుగుతూనే ఉంటుంది. ఇప్పుడు ప్రధాని రేసులో అందరికన్నా ముందు ఉన్న రిషి సునాక్ సైతం వివాదాల్లో చిక్కుకున్నారు. దీనికి రిషి జీవిత భాగస్వామి అక్షితా మూర్తిని సునాక్ ప్రత్యర్థులు తమ అస్త్రంగా వినియోగిస్తారు.
రిషి సునాక్ సంపన్న వర్గానికి ప్రతినిధి అని ముద్ర వేయడానికి ఆయన ప్రత్యర్థులు ప్రయత్నిస్తూ ఉంటారు. అందుకు 2001లో సునాక్ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తారు. రెండు దశాబ్ధాల క్రితం బీబీసీ డాక్యుమెంటరీ ‘మిడిల్ క్లాస్ రైజ్ అండ్ స్ప్రోల్’ అనే కార్యక్రమంలో రిషి సునాక్ మాట్లాడుతూ తనకు రాజ కుటుంబీకులు, ఉన్నత వర్గాల వారే స్నేహితులని, శ్రామికవర్గంలో ఫ్రెండ్స్ లేరని చెప్పారు. రిషి ఈ వ్యాఖ్యలే ఆయన ప్రజల మనిషి కాదని ఈ వీడియో క్లిప్ సాకుగా ప్రచారం ఆయన ప్రత్యర్థులు వాడుకొన్నారు.
అంతే కాదు.. ఆయన భార్య అక్షితా మూర్తి నివాహ హోదా కూడా వివాదాస్పదంగా మారింది. ఈ ఏడాది ఆమె 30 వేల పౌండ్లు చెల్లించి తన నాన్-డొమిసిల్ హోదా ఏడాది పాటు పొడిగించుకున్నారు. కానీ, యునైటెడ్ కింగ్డమ్ పరిధిలో పన్నులను ఎగవేయడానికే ఆమె నాన్ డొమిసిల్ హోదా వాడుకుంటున్నారని ప్రత్యర్థులు విమర్శలు గుప్పించారు.
దీనిపైనా అక్షితమూర్తి ఇటీవల రియాక్టయ్యారు. తన పన్ను హోదా తన కుటుంబ సభ్యులకు ఇబ్బందిగా మారకూడదనుకుంటున్నా అని చెప్పారు. ఇక నుంచి ప్రపంచవ్యాప్తంగా ఇన్ఫోసిస్ నుంచి వచ్చే ఆదాయానికి ప్రతియేటా బ్రిటన్‌లో పన్ను చెల్లిస్తానని తెలిపారు.
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేపథ్యంలో రష్యాలో పలు కార్పొరేట్ సంస్థలు కార్యకలాపాలు మూసేశాయి. షెల్, బ్రిటిష్ పెట్రోలియం కంపెనీలు ఉత్పత్తులు నిలిపేశాయి. ఈ చర్యను రిషి సునాక్ అభినందించారు. ఇన్ఫోసిస్ మాత్రం రష్యాలో కార్యకలాపాలు కొనసాగిస్తున్నది. మూసివేయడానికి నిరాకరించింది. ఇన్ఫోసిస్ నుంచి అక్షితా మూర్తి లాభాలు, ఆదాయం తీసుకుంటున్నారని రిషి సునాక్ ప్రత్యర్థులు విమర్శించారు.
బీబీసీ బ్రేక్‌ఫాస్ట్ షోలో పాల్గొన్న రిషి సునాక్.. ఇష్టపడే బ్రెడ్ ఏదో చెప్పమని యాంకర్ ప్రశ్నించారు. తమ ఇంట్లో పలు బ్రెడ్లు ఉంటాయని, తనకు, తన భార్య ఆరోగ్యానికి తగినట్లు ఉంటాయన్నారు. దీన్ని రిషి సునాక్ ప్రత్యర్థులు ఆయుధంగా మలుచుకున్నారు. కష్టపడి ఒక రొట్టె కొని ఉంటే, ఆయన ఇతర కుటుంబాలకు మద్దతు ఇచ్చేవాడని విమర్శలు గుప్పించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Double Murder | మీర్పేట్లో జంట హత్యల కలకలం.. పోలీసుల నిర్లక్ష్యమే కారణమా..?
Girl died | కార్డియాక్ అరెస్ట్‌తో స్కూల్లో కుప్పకూలిన తొమ్మిదేళ్ల బాలిక..!
Tirumala | దేశానికే ఆదర్శంగా నిలిచేలా తిరుమలలో వాటర్,ఫుడ్ అనాలసిస్ ల్యాబ్ అభివృద్ధి : టీటీడీ
4 Militants Killed | మణిపూర్‌లో ప్రత్యర్థి నాగా వర్గాల మధ్య కాల్పులు.. నలుగురు మిలిటెంట్లు మృతి
ప్రభుత్వ ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దని ఎమ్మెల్యే మందుల సామేల్కి వినతి
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

