ISIS deputy arrest : బాగ్దాదీ సహాయకుడు అరెస్ట్.. వెల్లడించిన ఇరాక్ ప్రధాని
ISIS deputy arrest : ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) నాయకుడు అబూ బకర్ అల్-బాగ్దాదీ సన్నిహితుడు సమీ జాసిమ్‌ను పట్టుకోవడంలో ఇరాక్ విజయం సాధించింది. ఐఎస్...

దుబాయ్ : (ISIS deputy arrest) ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) నాయకుడు అబూ బకర్ అల్-బాగ్దాదీ సన్నిహితుడు సమీ జాసిమ్‌ను పట్టుకోవడంలో ఇరాక్ విజయం సాధించింది. ఐఎస్ డిప్యూటీ హెడ్‌గా వ్యవహరిస్తున్న సమీ జాసిమ్.. ఐఎస్ ఫైనాన్స్ విషయాలను కూడా పర్యవేక్షిస్తున్నాడు. సమీని పట్టుకున్న విషయాన్ని ఇరాక్ ప్రధానమంత్రి ముస్తఫా అల్-కాధిమి ట్వీట్ ద్వారా తెలిపారు.
‘మా హీరోలు-ఇరాక్ భద్రతా దళాలు.. ఎన్నికలు నిర్వహించడంపై దృష్టి పెట్టారు. వారి సహచరులు సమీ జాసిమ్‌ను పట్టుకోవడానికి సంక్లిష్టమైన క్షేత్రస్థాయి కృషిని ప్రారంభించారు’ అని ప్రధానమంత్రి ముస్తఫా పేర్కొన్నారు. 2019 లో అమెరికా ప్రత్యేక దళాలు వాయవ్య సిరియాలో బాగ్దాదీని కాల్చి చంపాయి. ఆ సమయంలో సమీతో పాటు ప్రధాన ఐఎస్ ఉగ్రవాదుల గురించి సమాచారం అందించినందుకు యూఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ అవార్డును కూడా ప్రకటించింది.
సమీ జాసిమ్ పూర్తి పేరు సమీ జాసిమ్ ముహమ్మద్ అల్-జాబురి. హాజీ హమీద్ అని కూడా పిలుస్తారు. ఐసిస్ పూర్వీక సంస్థ అల్-ఖైదా ఇన్ ఇరాక్ (ఏక్యూఐ) సభ్యుడిగా రివార్డ్స్ ఫర్ జస్టిస్ వెబ్సైట్లో ఎఫ్‌బీఐ చూపించింది. ఎఫ్‌బీఐ ప్రకారం, 2014 లో దక్షిణ మోసుల్‌లో ఐసిస్ డిప్యూటీగా పనిచేస్తున్నప్పుడు, అతను ఆర్థిక మంత్రికి ప్రతిరూపంగా పనిచేశాడు. చమురు, గ్యాస్, ఖనిజాల అక్రమ విక్రయాల సమూహం ఆదాయ-ఉత్పాదక కార్యకలాపాలను పర్యవేక్షించే బాధ్యత ఈయనకు అప్పగించారు. అమెరికా ట్రెజరీ అతడిని 2015 సెప్టెంబర్ నెలలో బ్లాక్ లిస్ట్‌లో పెట్టింది.
ఇవి కూడా చదవండి..
బలూచిస్తాన్‌లో గ్రనేడ్ పేలుడు, జర్నలిస్ట్ మృతి
ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా ఫార్ములాను దొంగిలించిన రష్యా గూఢచారులు : ది సన్ నివేదిక
ప్రాక్టీస్ చేయకుండా 9 వేల మంది లాయర్లపై నిషేధం.. ఎందుకంటే?
వ్యక్తిగత ప్రయోజనాల కోసం హిందూ మతం మారకండి : మోహన్ భగవత్
ఏడాదిన్నర బాబు.. 100 మంది పోలీసులు.. 65 సీసీటీవీలు.. 45 గ్రామాలు.. చివరకి ఏమైందంటే?
డ్రీమ్11 వ్యవస్థాపకులపై కేసు నమోదు.. కారణం ఏంటంటే..?
లోకనాయకుడు.. జయప్రకాశ్ నారాయణ్
ప్రపంచాన్ని అనుసంధానించడంలో స్పేస్ది కీలకపాత్ర : ప్రధాని మోదీ
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Burglars loot jewellery showroom | జ్యుయలరీ షాపు గోడకు కన్నం వేసి.. రూ.10 కోట్ల విలువైన బంగారం, వజ్రాల ఆభరణాలు చోరీ
కారేపల్లిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
Arrest | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, అరెస్ట్
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

