(Police Action) గాంధీనగర్ : గోశాల నుంచి ఓ చిన్నారి ఏడుపు వినిపించడంతో అక్కడ పని చేస్తున్న ఓ వ్యక్తి పరుగెత్తుకు వచ్చి చూశాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. ఈ విషయం గుజరాత్ హోం మంత్రి హర్ష సింఘ్వికి చెవికి చేరడంతో.. తల్లిదండ్రుల కోసం గాలింపు చేపట్టాలని పోలీసులను ఆదేశించాడు. ఏడాదిన్నర చిన్నారి తండ్రిని కనిపెట్టేందుకు దాదాపు 100 మంది పోలీసులు గాంధీనగర్‌లోని 65 సీసీటీవీలను జల్లెడ పట్టారు. ఎవరో ఒక వ్యక్తి సాంత్రో కారులో వచ్చి చిన్నారిని గోశాలలో వదిలిపెట్టడం గుర్తించారు. నంబర్ ఆధారంగా కారు యజమాని సచిన్ దీక్షిత్ అని తెలుసుకున్నారు. దాంతో ఆ కారు యజమాని గురించి, చిన్నారి గురించి ఇరుగుపొరుగు 45 గ్రామాల ప్రజలను వాకబు చేశారు.
సచిన్ దీక్షిత్ మొబైల్ నంబర్‌ను ట్రేస్ చేయగా, రాజస్థాన్‌లోని కోటాలో ఉన్నట్లు తేలింది. దాంతో పోలీసులు కోటా చేరుకుని సచిన్ దీక్షిత్‌ను పట్టుకున్నారు. సచిన్ దీక్షిత్‌ను విచారించగా.. తల్లిదండ్రులు, భార్య అనురాధ, ఐదేండ్ల కుమారుడితో కలిసి వడోదరలో నివసిస్తున్నాడు. సచిన్ స్థానికంగా ఒక సంస్థలో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తుండగా.. ఆయన భార్య అనురాధ జీఐడీసీలో సొంత కంపెనీని నడుపుతున్నారు. గోశాలలో వదిలిపెట్టిన చిన్నారిపేరు శివాంశ్గా చెప్పాడు. చిన్నారిని గోశాలలో వదిలిపెట్టి కోటాకు వెళ్లిపోయానని పోలీసుల ఎదుట ఒప్పుకున్నాడు. సచిన్ కారులో నుంచి చిన్నారి చెప్పులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
సచిన్‌ను పోలీసులు గాంధీనగర్‌కు తరలించి విచారిస్తున్నారు. అయితే, ఆ చిన్నారి తమకు చెందింది కాదని సచిన్, అనురాధలు స్పష్టం చేశారు. దాంతో చిన్నారి అసలు తల్లి ఎవరు? అనే ప్రశ్న పోలీసుల ఎదుట తలెత్తింది. సచిన్ గోశాలలో చిన్నారిని ఎందుకు విడిచిపెట్టాడు? ఈ ప్రశ్నలకు సమాధానాల కోసం సచిన్‌ను విచారిస్తున్నారు. చిన్నారి తండ్రిని వెదికేందుకు ఆపరేషన్ ప్రారంభించిన పోలీసులు 24 గంటల్లోనే అసలు వ్యక్తిని గుర్తించినా.. చిన్నారి తమకు చెందినది కాదనడంతో అవాక్కయ్యారు. సచిన్ నోటి నుంచి అసలు విషయాలు బయటపడితేనే.. చిన్నారిని గోశాలలో ఎవరు పెట్టించారనేది తెలుస్తుందంటున్నారు పోలీసులు.
డ్రీమ్11 వ్యవస్థాపకులపై కేసు నమోదు.. కారణం ఏంటంటే..?
లోకనాయకుడు.. జయప్రకాశ్ నారాయణ్
ప్రపంచాన్ని అనుసంధానించడంలో స్పేస్ది కీలకపాత్ర : ప్రధాని మోదీ
నార్వేజియన్ సోలార్ ప్యానల్ కంపెనీతో 6 వేల కోట్ల రిలయన్స్ ఒప్పందం
గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించిన టయోటా మిరై
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..