Nethanyahu : ఇజ్రాయెల్ ప్రధాని (Israel PM) బెంజామిన్ నెతన్యాహు (Benjamin Netanyahu) , మాజీ రక్షణ మంత్రి గ్యాలెంట్లకు ఐసీసీ అరెస్ట్ వారెంట్ జారీపై ఇరాన్ (Iran) సుప్రీం లీడర్ (Supreme Leader) ఖమేనీ (Khamenei) తీవ్రంగా స్పందించారు. యుద్ధ నేరాలకు పాల్పడ్డ నెతన్యాహు, గ్యాలెంట్లకు కేవలం అరెస్ట్ వారెంట్ సరిపోదని, వారికి మరణదండన (Deat sentence) విధించాలని ఆయన డిమాండ్ చేశారు.
నెతన్యాహు, గ్యాలెంట్లకు ఇటీవల అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు అరెస్ట్ వారెంట్లు జారీచేసింది. ఈ అరెస్ట్ వారెంట్లపై ఖమేనీ సోమవారం స్పందిస్తూ అది చాలా తక్కువ అని, వారికి మరణశిక్ష విధించాలని డిమాండ్ చేశారు. సోమవారం బసిజ్ పారామిలిటరీ ఫోర్స్‌ను ఉద్దేశించి ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ప్రసంగించారు. గాజా, లెబనాన్‌లో ప్రజల ఇళ్లపై బాంబులు వేయడం విజయం కాదని ఆయన వ్యాఖ్యానించారు.