IDF: ఇజ్రాయెల్ ఫైటర్ జెట్‌ను టార్గెట్ చేసిన ఇరాన్ మిస్సైల్.. కానీ
IDF: ఇజ్రాయెల్ ఫైటర్ జెట్‌ను ఇవాళ ఓ ఇరాన్ క్షిపణి టార్గెట్ చేసింది. సర్ఫేట్ టు ఎయిర్ మిస్సైల్ ద్వారా ఇజ్రాయెల్ జెట్‌ను కూల్చాలని ఇరాన్ చూసింది. కానీ తమ విమానానికి ఎటువంటి ప్రమాదం జరగలేదని ఇవాళ ఐడీఎఫ్ వెల్లడించింది.
టెల్ అవివ్: ఇజ్రాయల్ రక్షణ దళం(IDF) ఇవాళ కీలక ప్రకటన చేసింది. తమ వైమానిక దళానికి చెందిన యుద్ధ విమానాన్ని.. ఇరాన్‌కు చెందిన యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ మిస్సైల్ సిస్టమ్ అటాక్ చేసినట్లు పేర్కొన్నది. ఇరాన్ గగనవీధిలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు ఇజ్రాయెల్ మిలిటరీ వెల్లడించింది. ఇజ్రాయెల్ యుద్ధ విమానాన్ని పేల్చేందుకు ఇరాన్ ప్రయత్నించినట్లు ఐడీఎఫ్ చెప్పింది. సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్‌ను ఇరాన్ లాంచ్ చేసిందని, కానీ తమ యుద్ధ విమానం ఆ క్షిపణిని గుర్తించి, ప్రమాదం నుంచి తప్పించుకున్నదని ఐడీఎఫ్ పేర్కొన్నది.
యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ అటాక్ చేసిన సమయంలో.. ఇజ్రాయెల్ ఫైటర్ పైలట్లు సంయమనంతో వ్యవహారించినట్లు ఐడీఎఫ్ చెప్పింది. దీని వల్ల తమ యుద్ధ విమానానికి ఎటువంటి డ్యామేజ్ కాలేదని పేర్కొన్నది. అనుకున్న రీతిలోనే మిషన్‌ను పూర్తి చేశామని ఐడీఎఫ్ వెల్లడించింది. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలను వెల్లడించేందుకు ఐడీఎఫ్ నిరాకరించింది.
ఇరాన్‌కు చెందిన యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ క్షిపణులు పలు సందర్భాల్లో ఇజ్రాయెల్ యుద్ధ విమానాన్ని టార్గెట్ చేశాయని, కానీ ఓ కేసులో మాత్రమే అతిసమీపంగా ఆ క్షిపణి వచ్చినట్లు చెప్పారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- anti aircraft
- Fighter jet
- IDF
- iran
RELATED ARTICLES
తాజా వార్తలు
Sensory Overload | సెన్సరీ ఓవర్‌లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్‌బండ్‌పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
Spirit New Poster | ప్రభాస్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ నుంచి కొత్త పోస్టర్, రిలీజ్ డేట్ వచ్చేసింది
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

