సుప్రీం నేతను కీర్తించనందుకు… ఇరాన్ బాలికను కొట్టి చంపారు
షహీద్ బాలికల ఉన్నత పాఠశాలను భద్రతా సిబ్బంది తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆ దేశ సుప్రీం నేతను కీర్తించే గీతాన్ని పాడాలని బాలికలను బలవంతం చేశారు.
టెహ్రాన్: ఇరాన్లో మరో దారుణం వెలుగుచూసింది. సుప్రీం నేత అయతుల్లా అలీ ఖమేనీని కీర్తించే గీతం పాడనందుకు 16 ఏళ్ల బాలికను ఆ దేశ భద్రతా సిబ్బంది కొట్టి చంపారు. వాయువ్య అర్దబిల్ నగరంలో ఈ సంఘటన జరిగింది. గత వారం షహీద్ బాలికల ఉన్నత పాఠశాలను భద్రతా సిబ్బంది తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆ దేశ సుప్రీం నేతను కీర్తించే గీతాన్ని పాడాలని బాలికలను బలవంతం చేశారు. అస్రా పనాహి అనే 16 ఏళ్ల బాలిక నిరాకరించగా క్లాస్‌రూమ్‌లో అందరి ఎదుట ఆమెను దారుణంగా కొట్టారు. తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చేరిన ఆ బాలిక చికిత్స పొందుతూ చనిపోయింది. అయితే ఆమె మరణానికి తాము బాధ్యులం కాదని ఆ దేశ అధికారులు తెలిపారు.
కాగా, ఇరాన్లో హిజాబ్‌కు వ్యతిరేకంగా నిరసనలు మిన్నంటిన తరుణంలో ఈ సంఘటన జరిగింది. బహిరంగ ప్రదేశంలో హిజాబ్ ధరించినందుకు 22 ఏళ్ల మహ్సా అమిని అరెస్ట్ చేసిన ఆ దేశ నైతిక పోలీసులు ఆమెను చిత్రహింసలకు గురి చేశారు. దీంతో కోమాలోకి వెళ్లిన ఆ యువతి మరణించింది. ఈ సంఘటను ఖండిస్తూ ఇరాన్ మహిళలు హిజాబ్‌కు వ్యతిరేకంగా గళమెత్తారు. భారీగా నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. నియంతృత్వ పాలన నశించాలని, తమకు స్వేచ్ఛ కావాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Supreme Court | పిల్లలకు ఇంటర్నెట్పై నిషేధం తగదు.. కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం
FSSAI | బిస్కెట్లలో దాణా.. పాలల్లో డిటర్జెంట్.. మూడు కంపెనీలపై ఎఫ్ఎస్ఎస్ఏఐ కేసులు
Uttarakhand | సీఎం సార్..నా భార్య అవినీతి లెక్క తేల్చండి..! ఉత్తరాఖండ్ మహిళా మంత్రిపై భర్త ఆరోపణలు
RTC Elections | ఆర్టీసీ ఎన్నికల ఫలితాలు తారుమారు?.. కాంగ్రెస్ అనుబంధ సంఘానికి కట్టబెట్టే యత్నం
Delhi Police | పోలీసుల దాష్టీకాలపై కదం తొక్కిన మహిళలు.. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

