Bushehr | ఓవైపు శాంతి చర్చలు జరుగుతుండగానే మరో వైపు డ్రోన్లు, క్షిపణులతో అమెరికా, ఇరాన్‌లు పరస్పరం దాడులకు పాల్పడుతున్నాయి. ఇరాన్(Iran) డ్రోన్లను కూల్చివేసిన అనంతరం అమెరికా దళాలు బుధవారం ఇరాన్ సైనిక స్థావరంపై తాజాగా రక్షణాత్మక దాడులు జరిపినట్లు అమెరికా అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రతీకార చర్యగా శుక్రవారం తెల్లవారుజామున ఇరాన్‌లోని బుషెర్ (Bushehr) ప్రావిన్స్‌లోని జామ్ ప్రాంతంలో అమెరికా విమానాన్ని ఇరాన్ దళాలు కూల్చివేశాయంటూ ఇరాన్ ప్రభుత్వ మీడియా పేర్కొంది.
అయితే అమెరికా విమానాన్ని కూల్చివేశారని ఇరాన్ మీడియాలో వస్తున్న వార్తలను అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) ఖండించింది. బుషెర్ పరిసరాల్లో ఎటువంటి అమెరికా విమానాన్ని లేదా డ్రోన్‌ను కూల్చివేయలేదని, అమెరికా వైమానిక ఆస్తులన్నీ సురక్షితంగా ఉన్నాయని స్పష్టం చేసింది.