iPhone Ban | యాపిల్ ఉత్పత్తులపై రష్యా ఆర్మీ నిషేధం విధించింది. ఆర్మీ ఆదేశాలతో రష్యన్ ఆర్మీ ఇకపై ఆపిల్ ఉత్పత్తులైన ఐఫోన్, ఐపాడ్స్‌ను ఉపయోగించలేరని మంత్రి మక్సూత్ షాదేవ్ను ఉటంకిస్తూ ఇంటర్ఫాక్ వార్తా సంస్థ పేర్కొంది. రష్యా డిజిటల్ డెవలప్మెంట్ మంత్రిత్వ శాఖ పనిలో ఉన్న ఉద్యోగులు ఆపిల్ ఐఫోన్లు, ఐప్యాడ్ల వాడకంపై నిషేధం విధించినట్లు నివేదిక పేర్కొంది. సైన్యం ఇకపై ఆపిల్‌కు చెందిన ఐఫోన్లు, ట్యాబ్‌లను అధికారిక కార్యకలాపాలతో పాటు ఈ-మెయిల్స్ కోసం ఉపయోగించలేరని స్పష్టం చేసింది.
అయితే, వ్యక్తిగత అవసరాల కోసం ఐఫోన్లను ఉపయోగించేందుకు అనుమతి ఇస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. అయితే, సంస్థపై వచ్చిన ఆరోపణలను ఆపిల్ ఖండించింది. ఇదిలా ఉంటే రష్యన్ ఆర్మీకి సంబంధించిన కంటెంట్‌ను తొలగించనందుకు ఆపిల్‌కు జరిమానా విధించింది. ఈ కంటెంట్ ఉక్రెయిన్ సైనిక చర్యకు సంబంధించింది కావడం గమనార్హం.
ఆపిల్‌తో పాటు, రష్యా గూగుల్, మెటా ఫేస్బుక్, వికీమీడియాలోని కంటెంట్‌కు సైతం జరిమానా విధించింది. రష్యా ప్రధాన దేశీయ భద్రతా సేవ ఎఫ్ఎస్బీ వాదనలను పరిగణలోకి తీసుకున్న రెండు నెలల తర్వాత మంత్రిత్వ శాఖ ఆపిల్ ఉత్పత్తులపై నిషేధం విధించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో రష్యా సైన్యం మాస్కోకు వచ్చిన తర్వాత ఆపిల్ రష్యాలో తన ఉత్పత్తులన్నింటినీ విక్రయించడాన్ని నిలిపివేసింది. దీంతో పాటు యాపిల్ పే సర్వీస్ సైతం నిలిచిపోయింది.