చరిత్రలో ఈరోజు : యోగాతో సంపూర్ణ ఆరోగ్యం
పురాతన కాలం నుంచి భారతదేశంలో యోగా ఒక సంప్రదాయం. రెగ్యులర్ యోగా ఆరోగ్యంగా ఉండటానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుందని అధ్యయనకారులు చెప్తున్నారు.

భారతదేశం సనాతనకాలం నుంచి యోగా ఎంతో ప్రాచుర్యంలో ఉన్నది. యోగాసనాలు చేయడం ద్వారా వివిధ దీర్ఘకాలిక వ్యాధులను నయం చేయవచ్చుననే విషయం బయటకు రావడంతో ఐక్యరాజ్య సమితి ఏటా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జూన్ 21 న జరుపుకోవాలని పిలుపునిచ్చింది. దాంతో భారతదేశంతో పాటు ప్రపంచ దేశాలన్నీ ఇవాళ 7 వ యోగా దినోత్సవాన్ని పాటిస్తున్నాయి. ఈసారి ‘యోగాతో సంపూర్ణ ఆరోగ్యం’ అనే ఇతివృత్తంతో ఉత్సవాలు జరుపుకుంటున్నాం.
పురాతన కాలం నుంచి భారతదేశంలో యోగా ఒక సంప్రదాయం. రెగ్యులర్ యోగా ఆరోగ్యంగా ఉండటానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుందని అధ్యయనకారులు చెప్తున్నారు. యోగా ప్రాముఖ్యతకు అంతర్జాతీయ హోదా ఇవ్వడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2014 సెప్టెంబర్ 14 న న ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ఒక తీర్మానాన్ని సమర్పించారు.ఈ తీర్మానంలో జూన్ 21 ను అంతర్జాతీయ యోగా దినంగా ప్రకటించాలని, తద్వారా ప్రపంచం నలుమూలల ప్రజలు యోగాలో చేరి తమకు తాము ఆరోగ్యంగా ఉంచుకోవచ్చునని పేర్కొన్నారు. 195 దేశాలకు గాను 175 దేశాలు ఈ తీర్మానానికి అంగీకరించాయి. ఆ తర్వాత 2014 డిసెంబర్ 11 న ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం ఏటా జూన్ 21 ను అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకోవాలని ప్రకటించింది. యూఎన్ జనరల్ అసెంబ్లీ ఈ తీర్మానాన్ని 3 నెలల్లోపు ఆమోదించింది. సర్వసభ్య సమావేశం ఇంత త్వరగా ఆమోదించిన మొదటి తీర్మానం ఇదే కావడం విశేషం.
యోగా దినోత్సవాన్ని జూన్ 21 న జరుపుకోవడం వెనుక ఒక కారణం కూడా ఉన్నది. వాస్తవానికి ఉత్తరార్ధగోళంలో జూన్ 21 అతి పొడవైన రోజు. భారతీయ సంప్రదాయం ప్రకారం, వేసవి కాలం తర్వాత సూర్యుడు దక్షిణ దిశగా తిరుగుతాడు. ఆధ్యాత్మిక విజయాలు సాధించడంలో సూర్యుడి దక్షిణనాయ కాలం ఎంతో మేలు చేస్తుందని అంటుంటారు. ఈ కారణంగా జూన్ 21 ను అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకుంటారు.
మరికొన్ని ముఖ్య సంఘటనలు..
2018 : న్యూజిలాండ్ ప్రధాని జెసిండాకు కూతురు జననం
2011 : ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ వర్ధంతి
2009 : సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ టైటిల్‌ను సొంతం చేసుకున్న తొలి భారతీయ మహిళగా నిలిచిన సైనా నెహ్వాల్
2003 : హ్యారీ పోర్టర్ సిరీస్‌లో భాగంగా ఐదో పుస్తకం విడుదల
1991 : భారతదేశం 9 వ ప్రధానమంత్రిగా పీవీ నరసింహ్మారావు ఎన్నిక
1975 : ఆస్ట్రేలియాను ఓడించి తొలి క్రికెట్ వరల్డ్ కప్‌ను కైవసం చేసుకున్న వెస్టిండీస్
1953 : పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి బెనజీర్ భుట్టో జననం
1949 : రాజస్థాన్‌లో హైకోర్టు ప్రారంభం
1948 : భారతదేశం గవర్నర్ జనరల్‌గా నియమితులైన సీ రాజగోపాలాచారి
ఇవి కూడా చదవండి..
బరువు తగ్గాలా..? ఈ చిట్కాలు పాటించండి..!
ఆఫ్ఘాన్‌లో ఇస్లామిక్ చట్టాన్ని అమలు చేస్తాం : తాలిబాన్ ప్రకటన
రామ మందిరం విషయంలో మా ఎంపీవన్నీ అబద్దాలే
ఏడు రాష్ట్రాల ఎన్నికల వేళ కేంద్ర క్యాబినెట్లో మార్పులు..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

